Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసిన షారూఖ్ పఠాన్

Advertiesment
Pathaan,
, గురువారం, 2 ఫిబ్రవరి 2023 (14:12 IST)
Pathaan,
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పఠాన్‌ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ కలెక్షన్లను చూరగొంటోంది. పఠాన్ విడుదలైన ఐదవ రోజు (ఆదివారం) దాదాపు రూ. 60 కోట్లను ఆర్జించిన ఈ సినిమా, యాక్షనర్ ఆల్-టైమ్ బెస్ట్ ఫస్ట్-సోమవారం కలెక్షన్ల ట్రాక్‌లో వుంది.
 
ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం థియేటర్లలో ఆరవ రోజు రూ.25.5 కోట్లు వసూలు చేసింది. దీంతో సినిమా మొత్తం దేశీయ కలెక్షన్ దాదాపు రూ.296 కోట్లకు చేరుకుంది. థియేటర్లలో గురువారం ఏడో రోజు ముగిసే సమయానికి పఠాన్ దేశీయంగా రూ.300 కోట్ల మైలురాయిని ఈజీగా దాటుతుంది. 
 
ఇది ఇప్పటివరకు ఏ హిందీ విడుదల కంటే వేగంగా ఈ ఫీట్‌ను సాధిస్తోంది. దంగల్‌కు 300 కోట్లు రాబట్టడానికి 13 రోజులు పట్టగా, బాహుబలి 2 10 రోజులు, కేజీఎఫ్ 2 11 రోజులు పట్టింది. హిందీ-భాషా విడుదలల కోసం సోమవారం అత్యధికంగా వసూలు చేసిన జాబితాలో బాహుబలి 2 మొదటి సోమవారం రూ. 40.25 కోట్లు సంపాదించింది. 
 
ఆ తర్వాత టైగర్ జిందా హై (రూ. 36.54 కోట్లు), హౌస్‌ఫుల్ 4 (రూ. 34.56 కోట్లు), క్రిష్ (రూ. 33.41 కోట్లు), బజరంగీ భాయిజాన్ (రూ. 27.05 కోట్లు) ఉన్నాయి. కరోనా మహమ్మారి తర్వాత, KGF: చాప్టర్ 2 (హిందీ) మొదటి సోమవారం టిక్కెట్ కౌంటర్‌లలో రూ. 25 కోట్లకు పైగా సంపాదించగలిగింది.
 
పఠాన్ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద $25.40 మిలియన్ (రూ. 207 కోట్లు) సంపాదించింది. ఆదివారం నాటికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల మార్కును దాటేసింది. దీంతో బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌ను తిట్టు తప్పులేదు.. భార్యపిల్లల గురించి మాట్లాడితే తాటతీస్తా