Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Panjaram: వెన్నులో వణుకు పుట్టించేలా పంజరం ట్రైలర్

Advertiesment
Sai Krishna, Anil, Yuvata Teja and others

చిత్రాసేన్

, గురువారం, 9 అక్టోబరు 2025 (16:31 IST)
Sai Krishna, Anil, Yuvata Teja and others
అనిల్, యువతేజ, ముస్కాన్, రూప ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం పంజరం. కొత్త వాళ్లంతా కలిసి చేసిన ఈ హారర్ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను బుధవారం నాడు రిలీజ్ చేశారు.  ఆర్ రఘన్ రెడ్డి నిర్మాతగా సాయి కృష్ణ దర్శకత్వంలో రూపొందింది.
 
ఈ ట్రైలర్‌ మాత్రం వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. పేదరాసి పెద్దమ్మ అంటూ ఓపెన్ చేసిన ట్రైలర్, ఊరుని చూపించిన తీరు, హారర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. హారర్ మూవీకి ఉండాల్సిన కెమెరా వర్క్, ఆర్ఆర్ ‘పంజరం’లో కనిపించాయి. ట్రైలర్‌లో చివరి షాట్ మాత్రం అందరినీ భయపెట్టించేలానే ఉంది.
 
దర్శకుడు సాయికృష్ణ మాట్లాడుతూ.. మోహన్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. ఆర్ఆర్, పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరూ పెద్ద స్టార్స్ అవుతారు. ప్రదీప్ అన్న ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించారు. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా సినిమాకు ఆడియెన్స్, మీడియా సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నాను అని అన్నారు.
 
హీరో యువతేజ మాట్లాడుతూ.. మల్లి అనే పాత్రను పోషించాను. నా కారెక్టర్, లుక్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. మా దర్శకుడు సాయి ఈ మూవీని గొప్పగా తీశారు. అనిల్ నాకు చిన్ననాటి స్నేహితుడు. రూప, ముస్కాన్ అద్భుతంగా నటించారు. నాని అన్న మ్యూజిక్ అదిరిపోద్ది. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
 
హీరో అనిల్, హీరోయిన్ రూప, ముస్కాన్ మాట్లాడుతూ.. పంజరం సినిమాకి మేం ప్రాణం పెట్టి పని చేశాం. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
 
నటుడు ప్రదీప్ మాట్లాడుతూ* .. ‘పన్నెండేళ్ల క్రితం మా జర్నీ ప్రారంభమైంది. సాయి కృష్ణతో షార్ట్ ఫిల్మ్‌ను తీశాను. అలా మా ప్రయాణం ప్రారంభమైంది. నాలుగేళ్ల క్రితం ‘పంజరం’ గురించి అనుకున్నాం. నన్ను ఆడిషన్ చేసి ఇందులో నాకు మంచి పాత్రను ఇచ్చారు. ముస్కాన్, రూప, అనిల్, యువతేజ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మా సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Satya Dev: శ్రీ చిదంబరం కథను నాకు ముందు చెప్పారు : సత్య దేవ్