Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగింపు దశలో పంజా వైష్ణవ్ తేజ్ చిత్రం

Advertiesment
Panja Vaishnav Tej
, సోమవారం, 2 జనవరి 2023 (11:42 IST)
Panja Vaishnav Tej
పంజా వైష్ణవ్ తేజ్,  శ్రీ లీల జంటగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం చేస్తుంది. వైష్ణవ్ తేజ్ మాస్ అవతారంలో కనిపించనున్నారు. దర్శకుడుగా శ్రీకాంత్.ఎన్.రెడ్డి పరిచయం అవుతుతున్నారు. ముగింపు దశలో చిత్రం షూటింగ్ ఉంది. ఈరోజు రిలీజ్ చేసిన విడుదల తేదీ ప్రచార చిత్రం ఆకట్టుకుంటున్నది. ఈ చిత్రాన్ని ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. 
 
ఆంగ్ల సంవత్సరాది శుభ వేళ ఈ చిత్రానికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని ఈరోజు విడుదల చేసింది చిత్ర యూనిట్. 29 ఏప్రిల్, 2023 న చిత్రం విడుదల అన్నది ఈ ప్రచార చిత్రం లో గమనించ వచ్చు. తీగల కంచె ఆవల అస్పష్టంగా కనిపిస్తూ కథానాయకుడు నిలుచున్న తీరు, మరో వైపు కంచె తగలబడుతున్న  వైనం, ఆసక్తిని రేకెత్తిస్తూ, ఆకట్టుకుంటోంది ఈ విడుదల తేదీ ప్రచార చిత్రం.
 
తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. ఈ విషయాన్ని గతంలో పౌరుషా నికి ప్రతీకగా విడుదల అయిన ప్రచార చిత్రం నిరూపించింది. అంతేకాదు భారీస్థాయిలో చిత్ర నిర్మాణం జరుగుతోంది.
 
మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే చిత్రం చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్రం టైటిల్, అలాగే చిత్రానికి  సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు ఫౌండేషన్ వెబ్ సైట్ ప్రారంభం