తమిళ చిత్ర పరిశ్రమలో నిర్వహించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఈ అవార్డు వేడుకలో భాగంగా సాయి పల్లవి ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి అవార్డు అందుకున్నారు మహారాజ సినిమాలో ఈయన నటనకు గాను ఈ అవార్డు అనుకున్నారు.
ఇక సాయి పల్లవి నటించి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్ సినిమాకు గాను ఈమె ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకున్నారు.
ఇక ఈ అవార్డు వేడుకలో భాగంగా సాయిపల్లవి మాట్లాడుతూ 22వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలో ఈ అవార్డు అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే చాలా గర్వంగా కూడా ఉంది ఎందుకంటే ఈ ఏడాది ఎన్నో గొప్ప సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
అమరన్ సినిమాలో రెబెకా వర్గీస్ పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామికి కృతజ్ఞతలు. అమరన్ లో నటించినందుకు తమిళ్, కేరళ, తెలుగు అభిమానుల నుంచి మంచి ఆదరణ వచ్చిందని అన్నారు.