Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయ్ సేతుపతి, సూరి కాంబినేషన్ విడుదల 2 మూవీ రివ్యూ

Advertiesment
Vijay Sethupathi, Suri, Vidudala 2

డీవీ

, శుక్రవారం, 20 డిశెంబరు 2024 (15:01 IST)
Vijay Sethupathi, Suri, Vidudala 2
నటీనటులు : విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ మీనన్, అనురాగ్ కశ్యప్ తదితరులు
 సాంకేతికత: సినిమాటోగ్రఫీ : ఆర్ వేల్ రాజ్, సంగీత దర్శకుడు : మాస్ట్రో ఇళయరాజా, దర్శకుడు : వెట్రిమారన్, నిర్మాతలు : ఎల్రెడ్ కుమార్, రామారావు చింతపల్లి
 
తమిళ కథానాయకుడు కేరెక్టర్ ఆర్టిస్టు విజయ్ సేతుపతి, సూరి, నటించిన విడుదలై తెలుగులో విడుదలగా రిలీజ్ అయి సక్సెస్ సాధించింది. పోలీసు వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలోని లోతుపాతులను బాగా చూపించారు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా “విడుదల 2” ఈరోజే విడుదలైంది. మరి ఎలా వుందో తెలుసుకుందాం.
 
కథ:
మొదటి పార్ట్ లో పోలీసు ఉద్యోగం నగ్జలైట్ల వుండే ప్రాంతంలో కుమరేసన్ (సూరి) కి వేయడం డ్రైవర్ గా వుండడం ఆ తర్వాత కురుపన్ గా పిలవబడే పెరుమాళ్ (విజయ్ సేతుపతి) ని కుమరేసన్ ద్వారా పట్టుకోవడం జరుగుతుంది. ఇక సీక్వెల్ లో విచారణ నిమిత్తం అక్కడే ఓ సీక్రెట్ ప్లేస్ లో అక్కడి అధికారి గౌతమ్ మీనన్ నానా హింసలు పెడుతుంటాడు. పై అధికారులు, మంత్రి సూచన మేరకు అక్కడ భద్రత కాదని ఫారెస్ట్ లో చెక్ పోస్ట్ దగ్గరకు తీసుకురమ్మని ఆజ్నాపిస్తారు. ఈ క్రమంలో అక్కడికి జర్నలిస్ట్ వచ్చి సీక్రెట్ గా కొన్ని ఫొటోలు తీస్తాడు. అవి పబ్లిష్ అయితే తమ బాస్ (సి.ఎం.)కు ఏమని సమాధాన చెప్పాలి? అదే జరిగితే తమకు బేడ్ నేమ్ వస్తుందని ఓ కీలక నిర్ణయం తీసుకుంటారు? అది ఏమిటి? అసలు పెరుమాళ్ళు చరిత్ర ఏమిటి? అనేది మిగిలిన కథ.
 
సమీక్ష:
పార్ట్ 1 కి కొనసాగింపుగా తీసుకొచ్చిన ఈ సీక్వెల్ లో దానికి అనుగుణంగా ముఖ్యంగా విజయ్ సేతుపతి పాత్రని తెరకెక్కించిన విధానం సరితూగింది. ఈ కథ జమీందార్ ల కాలం నాటింది. అప్పటి జమీందారులు తమ దగ్గర పనిచేసే నిమ్నజాతివారి స్త్రీలను తమ హక్కుగా భావించడం, ఎదురుతిరిగిన భర్తను చంపేయడం వంటివి కథకు మూలంగా దర్శకుడు ఎంచుకున్నాడు. ఆ ఊరిలో పాఠాలు చెప్పే టీచర్ పెరుమాళ్ళు అభ్యుదయ భావాలు గల కెకె. స్పూర్తితో ఏ విధంగా ప్రజాదళం పేరుతో పోరాటం చేశాడు? అనే అంశాలు చాలా కూలంకషంగా దర్శకుడు చర్చించాడు.
 
న్యాయం కోసం పోరాడేవాడు ప్రతివాడూ దళం సభ్యుడే. అలా షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసి అక్కడి కార్మికులను సంఘటితం చేసే క్రమంలో ప్యాక్టరీ ఓనర్ కుమార్తె మహాలక్మి (మంజు వారియర్) ను ఏవిధంగా పెండ్లిచేసుకున్నాడు? ఆ తదనంతర పరిస్థితులు,  ప్రజాదళం ఎటువైపు మళ్లింది? అనేవి పూసగుచ్చినట్లు చూపాడు. ఈకథనం ప్రతిచోట్ల ఎర్రదళం వున్న ప్రాంతాల్లో జరిగేవే. అప్పట్లో పోలీసులు, మంత్రులు తమ స్వార్థం కోసం తమ కింద పనిచేసేవారిని ఏవిధంగా ఉపయోగించుకున్నారు? తక్కువ కులంవారిలో వారిలో వారికి చిచ్చుపెట్టి తమ పబ్బం ఎలా గడుపుకున్నారనేది దర్శకుడు కసరత్తు చేసి తీశాడు. ముగింపు సన్నివేశం ఆలోచింపజేసేదిగా వుంది.
 
కార్మికులను చైతన్యపరిచే వాడిగా విజయ్ సేతుపతి తన పాత్రలో ఒదిగిపోయాడు. యుక్త వయస్సు నుంచి ఒక ఉద్యమ నాయకుడుగా ఎలా ఎదిగాడు అనే పాత్రలో తను జీవించారు అని చెప్పాలి. అలాగే మంజు వారియర్ కూడా ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు. ఇంకా నటుడు సూరి, గౌతమ్ మీనన్ లు తమకి ఉన్న స్క్రీన్ స్పేస్ లో బాగానే చేశారు.
 
పోరాటం చేసే వారు నిజంగా పోరాటం చేస్తే ఎలా వుంటుందో ఎన్ని బలిదానాలు వుంటాయో ఇప్పటి తరానికి భోదపడేట్లుగా వుంది. అసలు నగ్జలిజం, దళం అనేవారిని ఒక కోణంలో చూపించే ప్రభుత్వం మరో కోణంలో వారు చేసే అరాచకాలను బయటకురాకుండా చేసింది. భూస్వాములకు, పెట్టుబడిదారులకు ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా కొమ్మకాస్తుంతో పలు సన్నివేశాల్లో విశదీకరించడం బాగుంది. దళం సబ్యులు ఎక్కడ ఏవిధంగా కలుసుకుంటారు. అనేవికూడా డీల్ చేశాడు. 
 
అటవీ ప్రాంతంలో కథ సాగడంతో అక్కడకు తగినవిధంగా ఆర్ వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ నుంచి విజువల్స్ బాగున్నాయి.  ఇళయరాజా నేపథ్యం సంగీతం బాగుంది. ఎడిటింగ్ బెటర్ గా చేయాల్సింది మెయిన్ గా సెకండాఫ్ లో సినిమాలో పలు సన్నివేశాలు కట్ చేయాల్సింది.  దర్శకుడు వెట్రిమారన్ ప్రతిభను బాగా అందించారు ఫస్ట్ పార్ట్ రేంజ్ లో లేదు కానీ ఇంకా బెటర్ గా పలు సీన్స్ ని డిజైన్ చేయాల్సింది. ఇది మామూలు సినిమాకాదు కనుక సీరియస్ గా సాగే కథనం. మనిషి మనుగడకోసం చేసే పోరాటం అంశాలు, సంబంధిత డైలాగ్ లు వుండడం అవి ఇప్పటి జనరేషన్ కు అర్థంకావు అన్నట్లుగా కొన్ని పాత్రల్లో అవి చూపించి సక్సెస్ అయ్యాడు.ఇది  విజయ్ సేతుపతి వన్ మ్యాన్ షో.  దర్శకుడు సెకండాఫ్ లో ప్రొసీడింగ్స్ బాగా ల్యాగ్ చేసారు.
రేటింగ్:  2.5/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి సినిమాలో సోహైల్ ఖాన్ ఫస్ట్ లుక్