Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఘనంగా 89వ ఆస్కార్ అవార్డ్స్... రెడ్‌కార్పెట్‌పై తళుక్కుమన్న ప్రియాంకా... విజేతలెవరు?

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా 89వ ఆస్కార్ అవార్డుల ఉత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ వేడుక ప్రారంభంలో అనేక మంది హలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ, మహారథులు ఈ వేడుకలో పాల్గొని సందడి

Advertiesment
ఘనంగా 89వ ఆస్కార్ అవార్డ్స్... రెడ్‌కార్పెట్‌పై తళుక్కుమన్న ప్రియాంకా... విజేతలెవరు?
, సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (08:39 IST)
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా 89వ ఆస్కార్ అవార్డుల ఉత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ వేడుక ప్రారంభంలో అనేక మంది హలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ, మహారథులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. విభిన్న వస్త్రధారణతో తారలు రెడ్‌ కార్పెట్‌పై హొయలు పోతూ నడిచి రావడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌను అంటే తనదైన వస్త్రధారణంతో రెడ్‌కార్పెట్‌పై తళుక్కున మెరిశారు. 
 
తాజా సమాచారం మేరకు... ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న వారిలో... 
* ఉత్త‌మ స‌హాయ‌న‌టి: వివోలా డేవిస్‌ (ఫెన్సెస్‌) 
* సౌండ్ మిక్సింగ్‌: హాక్సా రిడ్జ్‌ 
* సౌండ్ ఎడిటింగ్‌: అరైవ‌ల్‌ (బెల్లీమార్‌) 
* ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: ఒ.జె. మేడ్‌ ఇన్‌ అమెరికా (ఎజ్రా ఎడిల్‌మ్యాన్‌, కరోలైన్‌ వాటర్లో) 
* ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌ అండ్‌ వేర్‌ టూ ఫైండ్‌ ధెమ్ ‌(కొలెన్‌ ఎట్‌ఉడ్‌) 
* ఉత్తమ మేకప్‌, కేశాలంకరణ: సుసైడ్‌ స్క్వాడ్‌ (అల్సాండ్రో బెర్టాల్జీ, జిర్జోయో గెగ్రేరియన్‌, క్రిస్టోఫర్‌ నీల్స‌న్‌‌) 
* ఉత్తమ సహాయనటుడు: మహేర్షల అలీ (మూన్‌లైట్‌). 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయిలంటే మాకెంతో ప్రేమ.. అందుకే దేవుడు మాకు ఆడపిల్లలను ఇచ్చాడనుకుంటా: మనోజ్