Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మాయిలంటే మాకెంతో ప్రేమ.. అందుకే దేవుడు మాకు ఆడపిల్లలను ఇచ్చాడనుకుంటా: మనోజ్

మలయాళ సినీ హీరోయిన్ భావనపై లైంగిక వేధింపు ఘటనకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న చిత్రరంగ ప్రముఖుల జాబితాలో మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కూడా చేరిపోయాడు. ఈ సందర్భంగా అమ్మాయిలపై అతడు చేసిన వ్యాఖ్య హృద్యంగా ఉం

Advertiesment
అమ్మాయిలంటే మాకెంతో ప్రేమ.. అందుకే దేవుడు మాకు ఆడపిల్లలను ఇచ్చాడనుకుంటా: మనోజ్
హైదరాబాద్ , సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (08:26 IST)
మలయాళ సినీ హీరోయిన్ భావనపై లైంగిక వేధింపు ఘటనకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న చిత్రరంగ ప్రముఖుల జాబితాలో మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కూడా చేరిపోయాడు. ఈ సందర్భంగా అమ్మాయిలపై అతడు చేసిన వ్యాఖ్య హృద్యంగా ఉంది. అమ్మాయిలంటే మా ఫ్యామిలీకెంతో ప్రేమ. అందుకే, దేవుడు మాకు ఎక్కువ ఆడపిల్లల్ని ఇచ్చాడనుకుంటున్నా అంటూ ఉద్వేగానికి గురయ్యాడు మనోజ్. తన మాటల్లో చెప్పాలంటే..
 
"నటి భావన ఘటన తర్వాత ఆడవాళ్లకు జరుగుతోన్న అన్యాయాలపై ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. చిన్నారులపై అఘాయిత్యాలు అనే వార్తలు చూస్తుంటే కత్తితో కోయాలనిపిస్తుంది. అమ్మాయిలంటే మా ఫ్యామిలీకెంతో ప్రేమ. అందుకే, దేవుడు మాకు ఎక్కువ ఆడపిల్లల్ని ఇచ్చాడనుకుంటున్నా."
 
అలాగే తను నటించిన గుంటూరోడు సినిమాను అనుకున్న దానికంటే ముందుగా విడుదల చేయడానికి కారణాలాను వివరించాడు మనోజ్. సినిమా హిట్టూ ఫ్లాపులకు ఈరోజుల్లో కారణాలెన్నో ఉంటాయి. ఉదాహరణకు... పెద్ద సినిమాలు వస్తే థియేటర్లు బ్లాక్‌ చేసి, మా థియేటర్లలో మా సినిమాలు వేసుకుంటామంటారు. బాగున్న చిన్న సినిమాకు ఇవ్వమన్నా ఇవ్వరు. పండగలు, మంచి సీజన్లు పెద్దోళ్లు తీసుకుని, ఎగ్జామ్స్‌ టైమ్‌ను చిన్న సినిమాలకు ఇస్తున్నారు. సరైన విడుదల తేదీ దొరక్క కొన్ని చిన్న సినిమాలు ఆడడం లేదు. ‘గుంటూరోడు’ను ఈ నెల 24న రిలీజ్‌ చేయాలనుకున్నాం. కానీ, సరిపడా సంఖ్యలో థియేటర్లు దొరకలేదు. సినిమా కూడా రెడీ కాలేదు. మార్చి 3న పోటీ ఉన్నప్పటికీ మేలో నా ‘ఒక్కడు మిగిలాడు’ విడుదలకు సిద్ధమవుతోంది. అందుకే, మార్చి 3న రిలీజ్‌ చేస్తున్నాం.
 
మోహన్ బాబు తనయులకే  సినిమాల రిలీజ్ విషయంలో ఇన్ని అడ్డంకులు ఎదురవతున్నాయంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరిస్దితి తేడా వస్తే గుడిసెకు వెళ్లాలంటే రెడీనా? ప్రణతిని అడిగిన మంచు