మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాకి , ఒక నవలకి సారూప్యత ఉందనే అప్పట్లో వార్తలు వచ్చాయి. అవతలి వారు కేసు పెట్టె స్థాయికి వెళ్ళింది. తాజాగా నిరాధారమైన ఆరోపణల గురించి మేకర్స్ స్పందించారు. దీనికి కొరటాల శివ దర్శకుడు.
“శ్రీమంతుడు, ఆ నవల రెండు పబ్లిక్ డొమైన్ లో వున్నాయి. రెండు వేటికవే భిన్నమైనవి. పుస్తకం, ఫిల్మ్ ను పరిశీలించే వారు ఈ వాస్తవాన్ని తక్షణమే ధృవీకరించవచ్చు. ఈ విషయం ప్రస్తుతం న్యాయ సమీక్షలో ఉంది. ఈ రోజు వరకు ఎటువంటి విచారణలు, తీర్పులు రాలేదు. అందువల్ల అప్పుడే ఒక అభిప్రాయానికి రావొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం. 'శ్రీమంతుడు' ముఖ్య ఉద్దేశం అయిన గ్రామాన్ని దత్తత తీసుకోవాలనే మా ప్రధాన ఆలోచనపై మేము దృఢంగా నిలబడతాము.
శ్రీమంతుడు కథపై సదరు రచయిత చేస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి. ఆ విషయం పై కోర్టు గాని, రచయితల సంఘము గాని ఎటువంటి తీర్పు ఇవ్వలేదనే వాస్తవం అందరు గ్రహించాలి. కోర్టు పరిధిలో వున్న అంశంపై అసత్య ప్రచారాలు చేస్తున్న ఎవరిమీదైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. దయచేసి ఆధారం లేని ఆరోపణలని ప్రచారం చేయొద్దని మీడియా వారిని కోరుతున్నాము అని తెలిపారు.