Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీ ప్రముఖులకు పార్టీ ఇచ్చిన ఎన్‌.టి.ఆర్‌., విషెస్‌ చెప్పిన రామ్‌చరణ్‌

Advertiesment
ntr, jeames, rajamouli
, గురువారం, 13 ఏప్రియల్ 2023 (10:29 IST)
ntr, jeames, rajamouli
జూ. ఎన్‌.టి.ఆర్‌. నిన్న రాత్రి తన ఇంటిలో సినీ ప్రముఖులకు విందుకు ఆహ్వానించారు. ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాలోని నాటునాట పాటకు ఆస్కార్‌ అవార్డు రావడంతో ఆయన అక్కడకు వెళ్ళిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాన్ వరల్డ్ సినిమా కూడా చేయనున్నాడనే వార్త కూడా తెలిసింది. ఈలోగా తన 30వ సినిమా కొరటాల శివతో ప్రారంభించారు. అయితే ఈ విందుకు జేమ్స్ ఫారెల్ (వైస్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్, అమెజాన్ స్టూడియోస్)  కూడా రావడం విశేషం. ఎన్‌.టి.ఆర్‌.  30వ సినిమా అమెజాన్‌ కైవసం చేసుకుందనే వార్తకూడా వినిపిస్తోంది.
 
ntr, jeames, rajamouli and others
ఈ విందులో రాజమౌళితోపాటు బాహుబలి నిర్మాతలు ఇతర నిపుణులు హాజరయ్యారు. అయితే రామ్‌చరణ్‌ ఎక్కడా! అంటూ కొందరు సోషల్‌మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. కానీ రామ్‌చరణ్‌ తన కుటుంబంతో విదేశాల్లో వున్నాడు. ఉపాసన గర్భిణి కనుక ఆమె కోరిక మేరకు ఆమె కుటుంబసభ్యులతో విహారయాత్రకు వెళ్ళారు. ఈ విషయాన్ని కూడా ఇంత రచ్చచేయడం అవసరమా! అంటూ చరణ్‌కు చెందిన సోషల్‌మీడియాలో ప్రతిస్పందించారు. 
 
ఏదిఏమైనా చరణ్‌, ఎన్‌.టి.ఆర్‌.లు ఇద్దరూ చాలా స్నేహంగా వుంటారు. ఇలాంటి వార్తలను తప్పుదోవ పట్టించేలా చేయడం కరెక్ట్‌ కాదని సినీవిశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి మహేష్‌బాబు, ప్రభాస్‌, రవితేజ ఇలాంటివారు గురించి విందుకు ఎందుకు హాజరుకాలేదనే విషయం తెలుసా! అంటూ వారిని ప్రశ్నిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ రెండు సమస్యలతో బాధపడుతున్న హీరోయిన్ సమంత