Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందరి ఆశీస్సులను అభిలషిస్తూ... 'మన దేశం'తోనే చరిత్రకు శ్రీకారం.. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావుపై రూపొందుతోన్న బయోపిక్‌ 'యన్‌.టి.ఆర్'. వారాహి చలన చిత్రం అండ్‌ విబ్రీ మీడియా సమర్పణలో ఎన్టీఆర్‌ తనయుడు, నటుడు బాలకృష్ణ టైటిల్‌ రోల్‌లో నటిస్

Advertiesment
NTR Biopic
, శుక్రవారం, 6 జులై 2018 (10:02 IST)
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావుపై రూపొందుతోన్న బయోపిక్‌ 'యన్‌.టి.ఆర్'. వారాహి చలన చిత్రం అండ్‌ విబ్రీ మీడియా సమర్పణలో ఎన్టీఆర్‌ తనయుడు, నటుడు బాలకృష్ణ టైటిల్‌ రోల్‌లో నటిస్తూ, నిర్మిస్తున్నారు. జాగర్లమూడి రాధకృష్ణ (క్రిష్‌) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ గురువారం మొదలైంది. 1949లో జూలై 5నే ఎన్టీఆర్‌ 'మనదేశం' సినిమాను స్టార్ట్‌ చేశారు.
 
నాడు, నేడు 'మన దేశం'తోనే చరిత్రకు శ్రీకారం.. తెలుగువారందరి ఆశీస్సులు కోరుతూ అంటూ ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. అలాగే 'అభిమానమును మించిన ధనము, ఆదరమును మించిన పెన్నిధి ఈ లోకమున లేదు. ఇందరి సోదరుల ప్రేమానురాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా రుణపడ్డట్లే! నా శుభాకాంక్షలు. సోదరుడు రామారావు.. 27.8.75' అంటూ 1975లో ఎన్టీఆర్‌ స్వయంగా రాసిన ఓ లేఖను బాలకృష్ణ లుక్‌తో పాటుగా చిత్రబృందం రిలీజ్‌ చేసింది. ఈ సినిమాకు కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. జ్ఞానశేఖర్‌ ఛాయాగ్రాహకుడిగా చేస్తున్నారు. 
 
కాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, నాగచైతన్య, రానా, శర్వానంద్‌ పేర్లు వినిపిస్తున్నారు. అలనాటి నటి సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ, సాయి కొర్రపాటి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హిందీలోను విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని 2019 జనవరి 9న విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. బాలకృష్ణ - క్రిష్‌ కాంబినేషన్‌‌లో గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చిన విషయం తెలిసిందే.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బే ''సంజు'' నాకు నచ్చలేదు.. త్రిషాలా దత్