అమ్మ మృతి.. పుట్టిన రోజు వేడుకలొద్దు ప్లీజ్.. ఫ్యాన్స్‌కు రజనీ లేఖ
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ పుట్టిన రోజుల వేడుకలను ఆయన ఫ్యాన్స్ అట్టహాసంగా జరుపుకుంటున్నారు. అయితే, ఈసారి రజనీ అభిమానులకి నిరాశే మిగిలింది. తన పుట్టినరోజు వేడుకలని జరుపుకోవద్దని రజనీ సూచించారు. తన పు
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ పుట్టిన రోజుల వేడుకలను ఆయన ఫ్యాన్స్ అట్టహాసంగా జరుపుకుంటున్నారు. అయితే, ఈసారి రజనీ అభిమానులకి నిరాశే మిగిలింది. తన పుట్టినరోజు వేడుకలని జరుపుకోవద్దని రజనీ సూచించారు. తన పుట్టినరోజైన డిసెంబర్ 12న అభిమానులు బ్యానర్లు, పోస్టర్ పెట్టొద్దని కోరారు. ఈ మేరకు రజనీ అభిమానులకి లేఖ రాశారు.
తమిళనాడు అమ్మ, మాజీ ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 6న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అమ్మ సంతాపంగా తమిళనాడు ప్రభుత్వం 10రోజుల పాటు సంతాప దినాలని ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. రజనీ పుట్టినరోజు వేడుకలకి అభిమానులు దూరంగా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. జయలలితతో రజనీకి మంచి అనుబంధం ఉంది.
ఆమె భౌతికకాయాన్ని చూసేందుకు వెళ్లిన రజనీ.. దుఖం ఆపుకోలేక బోరుమన్నాడు. గత ఏడాది కూడా రజనీ కాంత్ డిసెంబర్ చెన్నైని భీకరమైన వరదలు ముంచెత్తాయి. దీంతో అప్పట్లో తన పుట్టినరోజు వేడుకలకి అభిమానులు దూరంగా ఉండాలని అప్పుడు కూడా రజనీ సూంచారు. ఇప్పుడు జయ మరణం మరోసారి రజనీ అభిమానులని నిరాశపరిచారు. ఇకపోతే రజనీ కాంత్, రజనీ తాజా చిత్రం '2.ఓ ' వచ్చే యేడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.