గౌతమి రాజకీయాల్లోకి రానుందా? బీజేపీలో చేరుతుందా? అమ్మ వర్గం గౌతమి వైపుందా?
సీనియర్ హీరోయిన్, నటుడు కమల్ హాసన్ మాజీ భార్య గౌతమి రాజకీయాల్లోకి రానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ మధ్య గౌతమి అడుగులు రాజకీయాలపై వైపు పడుతున్నాయన్నది మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గౌతమ
సీనియర్ హీరోయిన్, నటుడు కమల్ హాసన్ మాజీ భార్య గౌతమి రాజకీయాల్లోకి రానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ మధ్య గౌతమి అడుగులు రాజకీయాలపై వైపు పడుతున్నాయన్నది మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గౌతమి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైంది. కమల్ హాసన్‌తో విడిపోవడానికి కొద్దిరోజుల ముందే గౌతమి ప్రధానిని కలిసింది. ఆ భేటీ విషయాలేవీ బయటికి పొక్కలేదు.
తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత గౌతమి స్పందన కూడా ఆమె రాజకీయాల వైపే ఉన్నాయని తెలుస్తోంది. జయ మరణంపై ప్రధాని మోడీకి లేఖ రాసింది గౌతమి. ఇందులో జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఒక ముఖ్యమంత్రికి అందించిన చికిత్స విషయంలో అంత గోప్యత పాటించవలసిన అవసరం ఏముందని సూటిగా ప్రశ్నిస్తున్నారు. జయ మృతిపై ప్రజల్లో పలు అనుమానాలు ఉన్నాయని.. వాటిని నివృత్తి చేయాలని ప్రధానిని కోరింది.
ముందుగా గౌతమి వ్యాఖ్యలని లైట్ తీసుకొన్న జనాలు.. ఇప్పుడామే ఆమె ఆరోపణలపై ఆసక్తిని చూపుతున్నారు. మెల్లమెల్లగా గౌతమికి మద్దతు పెరుగుతోంది. జయ మరణంపై అనుమానులు వ్యక్తం చేసే ఓవర్గం ప్రజలు గౌతమి వెనకాల నడిచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే.. గౌతమి రాజకీయాల్లోకి రానుందని జోరుగా ప్రచారం సాగుతోంది.
కాగా ముఖ్యమంత్రి జయలలిత మరణంతో తమిళనాడు శోక సముద్రంలో మునిగిపోయింది. ఆమె మరణం పట్ల జాతీయ నేతలు, బాషా బేధం లేకుండా అన్ని రాష్ట్రాల రాజకీయ, సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ రజజీకాంత్ ఏకంగా ఏడ్చేశారు. అయితే, జయమృతి పట్ల ఒక్క కమల్ హాసన్ చేసిన ట్విట్ మాత్రం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
'జయ మృతి పట్ల చింతించేవాళ్లకు, ఆమె మీద ఆధారపడి బతుకుతున్న వాళ్లకు తన ప్రగాడ సానుభూతి' అంటూ ట్విట్ చేశాడు కమల్. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. అయితే కమల్ జయకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే ఆతనితో 13 ఏళ్ల పాటు సహజీవనం చేసి.. ఆపై దూరమైన గౌతమి మాత్రం జయలలిత మరణంలో సస్పెన్స్ ఉందని కామెంట్లు చేయడం గమనార్హం.