అవసరాలతో లిప్ లాక్ సీన్ ఈజీగా చేసేసిన తేజస్వి మడివాడ.. క్యాజువల్‌గా చేసేసిందట
తేజస్వి మడివాడ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ హాట్ ఛాన్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుందని టాక్ వస్తోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో మహేష్ మరదలిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తేజస్వి. ఆ మూవీల
తేజస్వి మడివాడ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ హాట్ ఛాన్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుందని టాక్ వస్తోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో మహేష్ మరదలిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తేజస్వి. ఆ మూవీలో మహేష్ ముద్దు పెడతానంటే భయపడి పారిపోయే క్యారెక్టర్ చేసిన తేజస్వి.. ఆ తరువాత రాంగోపాల్ వర్మ 'ఐస్ క్రీం'తో హాట్ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా బాబు బాగా బిజీ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌తో లిప్ లాక్ సీన్ కూడా చేసేసింది ఈ హాట్ హీరోయిన్.
ఫస్ట్ టైం లిప్‌లాక్ కావడంతో మొదట భయపడ్డానని.. కానీ సీన్‌లోకి వెళ్ళిన తరువాత చాలా క్యాజువల్‌గా చేసేశానని అంటోంది. హిందీ హంటర్ రీమేక్‌గా వస్తోన్న ఈ అడల్ట్ కామెడీలో అమ్మడు బాగానే అందాలను ఆరబోసిందని టాక్ వస్తోంది. కామెడీ కంటే అడల్ట్ కంటెంటే ఎక్కువగా వుంటుందని ఇన్‌సైడ్ టాక్. దానికి తగ్గట్టే ఈ మూవీలో ఏకంగా నలుగురు హీరోయిన్లతో అవసరాల రొమాన్స్ చేస్తాడని సమాచారం.