Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

SSMBతో నివేదా థామస్.. త్రివిక్రమ్ ''పార్థు''లో అమ్మడు సెకండ్ హీరోయినా?

Advertiesment
SSMBతో నివేదా థామస్.. త్రివిక్రమ్ ''పార్థు''లో అమ్మడు సెకండ్ హీరోయినా?
, గురువారం, 3 జూన్ 2021 (16:08 IST)
పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ సినిమాలో నటించిన నివేదా థామస్‌కు బంపర్ ఆఫర్ వరించింది. ఏవి పడితే అవంటూ క్యారెక్టర్లు ఎంచుకోకుండా తనకంటూ ఓ ప్రత్యేక రోల్‌ను ఎంపిక చేసుకునే నివేదా థామస్‌ కోసం కోలీవుడ్‌లో నువ్వా, నేనా అన్న‌ట్టు పోటీప‌డ‌తారు క‌మ‌ల్ అండ్ ర‌జ‌నీకాంత్‌. వీరిద్ద‌రికీ కూతురుగా న‌టించారు నివేదా. తెలుగులో నాని, ఎన్టీఆర్‌, రీసెంట్‌గా ప‌వ‌న్ సినిమాల‌తో మెప్పించింది. 
 
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రొమాన్స్ చేయనుంది. త్వ‌ర‌లోనే తెలుగు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ మూవీలోనూ ఛాన్స్ ద‌క్కించుకున్నార‌నే మాట గ‌ట్టిగానే వినిపిస్తోంది.  కియారా అద్వానీ, జాన్వీ కపూర్‌, దిశా పటానీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని ఫైనల్‌ చేస్తారో తెలియరాలేదు. నివేదా సెకండ్‌ హీరోయిన్‌గా కనిపిస్తుందని సమాచారం. లేడీస్ స్పెష‌ల్ అన్న‌ట్టు ఎప్పుడూ త‌న సినిమాల్లో స్పెష‌ల్ కేర‌క్ట‌ర్స్ డిజైన్ చేసే త్రివిక్ర‌మ్.. నివేదా కోసం ఎలాంటి రోల్ డిజైన్ చేశారోనని టాక్ వస్తోంది.
 
ఇదిలా ఉంటే త్రివిక్రమ్ మహేష్ చిత్రానికి "పార్థు" అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. అతడు సినిమాలో మహేష్‌ పాత్ర పేరు పార్థు అనే విషయం తెలిసిందే. అదే లేటెస్ట్ సినిమాకి టైటిల్‌ అనుకుంటున్నారని సమాచారం. ఇక అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతుంది. త్వరలోనే ది రెగ్యూలర్‌ షూటింగ్‌ని ప్రారంభించుకోనుంది. ఇక ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించబోతున్నారు.
 
ఇకపోతే.. ప్రస్తుతం నివేదా తెలుగులో `మిడ్‌నైట్‌ రన్నర్‌` అనే రీమేక్‌ చిత్రంలో నటిస్తుంది.  అంతేగాకుండా.. ఓ వైపు సినిమాలు చేస్తూనే డైరెక్షన్‌ కోర్స్ పూర్తి చేసిందట. అందుకే భవిష్యత్‌లో కచ్చితంగా దర్శకత్వం చేస్తానని చెప్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుర్రకారుకు కునుకులేకుండా చేస్తున్న వరంగల్ భామ!