తెలుగు చిత్రపరిశ్రమలో రాణించి, మంచి పేరుతో పాటు గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. ఈ బెంగుళూరు బ్యూటీ కన్నడ సినిమాల్లో కంటే తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లోనే అధికంగా నటించారు. ముఖ్యంగా తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉంటూ స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్. సాయి పల్లవి కంటే ముందుగా ఇక్కడ నటన పరంగా వినిపించిన పేరు నిత్యామీననే. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఆమె బహిర్గతం చేశారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 
 
									
										
								
																	
	 
	తెలుగు చిత్రపరిశ్రమలోని హీరోలంతా నా పట్ల ఎంతో గౌరవ మర్యాదలతో నడుచుకున్నారు. ఇక్కడ నాకు ఎలాంటి సమస్యలూ తలెత్తలేదు. కానీ, ఒక తమిళ హీరో మాత్రం అసభ్యంగా పదేపదే నన్ను తాకుతూ ఇబ్బంది పెట్టాడు. దీంతో ఆ చిత్రాన్ని చాలా కష్టంగా పూర్తి చేయడం జరిగింది అని వివరించారు.