Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిఖిల్ హీరోగా 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'

'స్వామిరారా', 'కార్తికేయ‌', 'సూర్య vs సూర్య' వంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో వ‌రుసగా హ్యాట్రిక్‌ సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో యూత్‌లో యంగ్ఎన‌ర్జిటిక్ స్టార్‌గా ఎదిగిన హీరో నిఖిల్ మ‌రో వినూ

Advertiesment
Nikhil Siddhartha
, మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (13:25 IST)
'స్వామిరారా', 'కార్తికేయ‌', 'సూర్య vs సూర్య' వంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో వ‌రుసగా హ్యాట్రిక్‌ సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో యూత్‌లో యంగ్ఎన‌ర్జిటిక్ స్టార్‌గా ఎదిగిన హీరో నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో వ‌స్తున్న చిత్రం 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'. ఈ చిత్రంలో నిఖిల్‌కి జంట‌గా 21F ఫేం హెబ్బా ప‌టేల్, త‌మిళంలో 'అట్ట‌క‌త్తి', 'ముందాసిప‌త్తి', 'ఎధిర్ నీచ‌ల్' వంటి వ‌ర‌ుస సూప‌ర్‌హిట్స్‌లో నటించిన నందిత‌ శ్వేతలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 
 
ఇటీవ‌లే విడుద‌ల చేసిన మెద‌టిలుక్‌కి విప‌రీత‌మైన స్పంద‌న రావ‌టం తెలిసిన విష‌య‌మే. చూసిన ప్ర‌తి ఓక్క‌రూ టైటిల్ చాలా వినూత్నంగా ఉంద‌ని సోష‌ల్ మీడియాలో వారి స్పంద‌న‌లు తెలిపారు. ఇలాంటి క్రేజీ ప్రోజెక్టుని 'టైగ‌ర్' ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కిస్తున్నారు. మేఘ‌న ఆర్ట్స్ నిర్మాణంలో మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఢిఫ‌రెంట్ లవ్ స్టోరీని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం చిక్‌మంగ్‌లూర్‌లో చివ‌రి షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. సెప్టెంబ‌ర్ 12 నాటికి టోట‌ల్ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అక్టోబ‌ర్ లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ మా మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఢిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో విజ‌యాల్ని సోంతం చేసుకున్న నిఖిల్‌ హీరోగా, స‌క్స‌స్‌ఫుల్ బ్యూటీస్‌ హెబాప‌టేల్, నందిత శ్వేత‌ల కాంబినేష‌న్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా మాచిత్రం 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' నిర్మిస్తున్నాం. 'టైగ‌ర్' వంటి క‌మ‌ర్షియ‌ల్ హిట్ చిత్రం త‌ర్వాత మా ద‌ర్శ‌కుడు ఆనంద్ చాలా కొత్తగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ మా హీరో నిఖిల్ బర్త‌డే‌కి గిఫ్ట్‌గా విడుద‌ల చేశాము. 
 
సినిమా ఇండ‌స్ట్రీ నుండే కాకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి అప్లాజ్ రావ‌టం అంతేకాకుండా ట్రేడ్ బిజినెస్ వ‌ర్గాల్లో క్రేజ్ వ‌చ్చింది. ట్రెండ్‌లో ఉంటూనే ఎంట‌ర్‌టైనింగ్ చేయ‌టంలో మా హీరో నిఖిల్‌, ద‌ర్శ‌క‌ుడు ఆనంద్ సిద్ధ‌హ‌స్తులే అని మ‌రోక్క‌సారి ఈ చిత్రం ప్రూవ్ చేస్తుంది. ఇప్పిటికే ఈ సినిమా టైటిల్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావడం చాలా హ్య‌పీగా వుంది. త్వ‌ర‌లో శేఖ‌ర్ చంద్ర అందించిన‌ ఆడియోని విడ‌ుద‌ల చేస్తాం. ఈనెల 12కి చిత్రం టాకీ కంప్లీట్ చేస్తాం. అక్టోబ‌రులో చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తాం. తెల‌ుగు ప్రేక్ష‌కులంద‌రికీ వినాయ‌క చ‌వ‌తి శుభాకాంక్ష‌లు" అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్తల్లో నా గొంతు బాలేదని అనేవారు.... నాగార్జున