Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిఖిల్ సినిమా ఎంతవ‌ర‌కు వ‌చ్చింది..?

యువ కథానాయకుడు నిఖిల్ నటిస్తోన్న తాజా చిత్రం ముద్ర. ఇందులో నిఖిల్ స‌ర‌స‌న‌ లావణ్య త్రిపాఠి న‌టిస్తోంది. టి.ఎన్. సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్, లావణ్య త్రిపాఠిలపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నిఖిల్ పుట

Advertiesment
నిఖిల్ సినిమా ఎంతవ‌ర‌కు వ‌చ్చింది..?
, మంగళవారం, 17 జులై 2018 (12:11 IST)
యువ కథానాయకుడు నిఖిల్ నటిస్తోన్న తాజా చిత్రం ముద్ర. ఇందులో నిఖిల్ స‌ర‌స‌న‌ లావణ్య త్రిపాఠి న‌టిస్తోంది. టి.ఎన్. సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్, లావణ్య త్రిపాఠిలపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ముద్ర ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇప్పటివ‌రకు ఈ సినిమా దాదాపుగా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో నిఖిల్ పాత్ర విష‌యానికి వ‌స్తే...ఈ సినిమాలో విలేకరిగా నటిస్తున్నారు. సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నారు.
 
ఈ చిత్రాన్ని అవురా సినిమాస్ ప్రైవేటు లిమిటెడ్, మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బి.మధు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. మ‌రి...ఈసారి ఎలాగైనా స‌రే స‌క్స‌స్ సాధించాల‌నుకుంటోన్న నిఖిల్‌కి ముద్ర విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సన్నీలియోన్‌కు కష్టాలు.. ''కౌర్'' అనే పదం వాడకండి.. పాపకు పుట్టినరోజు