Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిహారికకు పెళ్లి కళ వచ్చేసిందే బాల.. ఫోటోలు వైరల్

Advertiesment
నిహారికకు పెళ్లి కళ వచ్చేసిందే బాల.. ఫోటోలు వైరల్
, శనివారం, 5 డిశెంబరు 2020 (19:04 IST)
Niharika
మెగా డాటర్‌ నిహారిక పెళ్లి, చైతన్యతో డిసెంబర్‌ 9న జరగబోతోన్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా అతి తక్కువ మంది సమక్షంలో నిహారిక పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి సంబంధించిన పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. పార్టీలతో మెగా కుటుంబం అంతా హ్యాపీ మూడ్‌లో ఉంది. రాజస్థాన్‌లో నిహారిక పెళ్లి జరగనుంది. ఇక తాజాగా నిహారిక తన ఇన్‌స్టాగ్రమ్‌ అకౌంట్‌లో ఓ ఫొటోని షేర్‌ చేసింది. 
 
నిహారిక ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఆమెను ఇద్దరు లేడీస్‌ రెడీ చేస్తున్నారు. వారిద్దరూ తన కాళ్లు పట్టుకున్నట్లుగా ఈ ఫొటో ఉంది. చూసిన వారంతా అదే అనుకుంటారని భావించిన నిహారిక ఈ ఫొటో గురించి వివరణ ఇచ్చింది. ''ఈ ఫొటోలోని వారు నా హీల్స్‌ను సరిచేస్తున్నారు. వారిద్దరూ పెళ్లికూతురుని చక్కగా రెడీ చేస్తారు కాబట్టే.. నాకు తెలిశారు. లవ్‌ యు గర్ల్స్‌..'' అని నిహారిక తెలుపుతూ.. మరో ఫొటోలో వారిద్దరిని పరిచయం చేసింది. ఇప్పుడీ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
 
అలాగే మరో రెండు రోజులలో మెగా ఫ్యామిలీ అంతా రాజస్థాన్‌లో ప్రత్యక్షం కానుంది. మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలతో తెగ సందడి చేయనున్నారు. కొద్ది రోజులుగా నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతుండగా, అందుకు సంబంధించి పలు ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తాజాగా నిహారికని పెళ్లి కూతురు చేసే కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. వీటిని చూసిన నెటిజన్స్ నిహారికకు పెళ్లి కళ వచ్చేసిందే బాల అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాపు బొమ్మ ప్రణీతను వరిస్తున్న బాలీవుడ్ ఆఫర్లు..