శింబు కథానాయకుడు అంటేనే నాయికలు అందాల ఆరబోస్తారు. అందులోనూ మూడు ప్రాతలు పోషించిన తమిళ చిత్రాన్ని తెలుగులో 'AAA` గా విడుదల చేస్తున్నారు. కుసుమ ఆర్ట్స్ పతాకంపై యాళ్ళ కీర్తి నిర్మాణ సారథ్యంలో.. జక్కుల నాగేశ్వరరావు సమర్పణలో రూపొందిన డబ్బింగ్ చిత్రం 'AAA'. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత యాళ్ళ వెంకటేశ్వరరావు (కృపావరం) తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సందర్భంగా చిత్ర నిర్మాత యాళ్ళ వెంకటేశ్వరరావు చిత్ర విషయాలను తెలియజేశారు.
ఆయన మాట్లాడుతూ.. ''టాప్ స్టార్స్ శింబు, తమన్నా, శ్రియ హీరో హీరోయిన్లుగా రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'AAA'. యాక్షన్ తో పాటు ఫుల్ గ్లామర్ కలబోసిన చిత్రమిది. ఈ నెల 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రానికి కావాల్సిన అన్ని హంగులను సమకూర్చాం. డైలాగ్స్, పాటలు అన్నీ ప్రేక్షకులను మెప్పిస్తాయి. మా బ్యానర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అందరూ ఈ చిత్రాన్ని చూసి ఆశీర్వదించాలని కోరుతున్నాను.." అని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జక్కుల నాగేశ్వరరావు, బాలాజీ నాగలింగం, బొప్పన గోపీ తదితరులు పాల్గొన్నారు.
శింబు, తమన్నా, శ్రియ తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: జక్కుల నాగేశ్వరరావు, సంగీతం: యువన్ శంకర్ రాజా, పాటలు: శశాంక్ వెన్నెలకంటి, సహా నిర్మాతలు: యాళ్ళ మేరీ కుమారి, యాళ్ళ రాహుల్, నిర్మాత: యాళ్ళ వెంకటేశ్వరరావు (కృపావరం), దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్.