బాలీవుడ్ నటి నీనాగుప్తా ఇటీవలే తన ఆత్మకథ సచ్ కహున్ తోహ్ పేరుతో పుస్తకాన్ని విడుదల చేసింది. అందులో కొన్ని ఆసక్తికరమ ఐన సంఘటనలను తెలియజేసింది. 1989 ప్రాంతంలోనే వెస్ట్ ఇండీస్ క్రికెట్ కెప్టెన్ రిచ్చర్డ్‌తో సహజీవనం చేసింది. అనంతరం ఆమె గర్భతి. ఆ సమయంలో రిచర్డ్‌కు అప్పటికే పెళ్ళయిందని తెలిసింది. ఆ తర్వాత ఆమె ఒంటరిగా జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయిం తీసుకుంది. సమాజంలో ఇటువంటి సంఘటనలవల్ల మహిళకు ఎటువంటి ఆదర వుంటుందో అవన్నీ నేను అనుభవించానని తెలియజేసింది. ఆ ఘటన తర్వాత ఢిల్లీ నుంచి ముంబైకు మకాం మార్చేసింది.
ముంబైలో తన స్నేహితుడు సుజోయ్ మిత్రా ఓ విషయాన్ని చెప్పాడు. బాంద్రాలో గేను పెళ్లిచేసుకుంటే బెటర్. అన్నివిధాలా బాగుంటుందని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి కూడా వచ్చి బిడ్డ తెల్లగా వుంటే నీలా వున్నాడని, నల్లగా వుంటే నాలా వుంటాడని చెబుతూ, మనకు పుట్టిన బిడ్డగా పెంచుదాం అన్నాడట. తను అందుకు తిరస్కరించింది. అనంతరం ఆమెకు కుమార్తె పుట్టింది. మసాబా ఆమె పేరు. తను ఫ్యాషన్ డిజైనర్‌గా వుంది. ఇక నీనా 2008లో ఢిల్లీకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ వివేక్ మెహ్రాని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం నీనా గుప్తా, కపిల్ దేవ్ జీవితం ఆధారంగా వస్తున్న 83తో పాటు అమితాబ్‌తో మేడే సినిమాలోనూ నటిస్తున్నారు.