Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మానాన్నలైన నయనతార - విఘ్నేష్ శివన్

nayanthara - vignesh shivan
, ఆదివారం, 9 అక్టోబరు 2022 (19:54 IST)
హీరోయిన్ నయనతార - కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌లు మమ్మీడాడీలు అయ్యారు. వీరికి పండంటి మగబిడ్డలు జన్మించారు. గత జూన్ నెల 9వ తేదీన మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట కేవలం నాలుగు నెలల్లోనే తల్లిదండ్రులు అయ్యారు. ఇదే విషయంపై విఘ్నేష్ శివన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"నయనతార, నేను అమ్మానాన్నలమయ్యాం. మాకు కవల పిల్లలు జన్మించారు. ప్రార్థనలు, పూర్వీకుల ఆశీర్వాదాలు, ఈ శుభ విషయాలన్నీ కలిసి దేవుడు మాకు జంట పిల్లలను ప్రసాహించారు. మా ప్రాణానికి, ప్రపంచానికి మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి" అని పేర్కొన్నారు. 
 
అయితే, నయనతార ప్రెగ్నెన్సీ కూడా కాలేదు కదా అనుకుంటున్నారా..? సరోగసి పద్ధతిలో విగ్నేష్ శివన్, నయనతార అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ఈ జంటకు ఇద్దరూ మగ బిడ్డలు పుట్టారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. తను నయనతార ఇద్దరు అబ్బాయిలకు పేరెంట్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు. 
 
తమ జీవితంలో ఇది ఒక కొత్త చాప్టర్ అంటూ రాసుకొచ్చాడు విగ్నేష్. ఈ మూమెంట్ చాలా ఆనందంగా ఉందని.. నయనతార కూడా ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పాడు ఈ దర్శకుడు. తమ ఇద్దరు పిల్లల పాదాలకు ముద్దు పెడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విగ్నేష్ శివన్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టం : నయనతార