Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నమ్రత పుట్టిన రోజు వేడుకలు.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నారా బ్రాహ్మణి

Nara Bramhani

సెల్వి

, గురువారం, 25 జనవరి 2024 (15:34 IST)
Nara Bramhani
మాజీ మిస్ ఇండియా, సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత పుట్టిన రోజు వేడుకల్లో   నందమూరి బాలకృష్ణ కుమార్తె, నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి సందడి చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
జనవరి 22న జరిగిన ఈ వేడుకలో బ్రాహ్మణి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. బ్రాహ్మణితో పాటూ ఈ పార్టీలో మహేశ్ బాబు సిస్టర్స్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి, పలువురు ఫ్యాషన్ డిజైనర్లు, స్నేహితులు పాల్గొన్నారు.  
 
జర్మనీలో ఉన్న మహేశ్ కూడా తన భార్య నమ్రతకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కాలంలో మహేష్ నేచురోపతి ట్రీట్‌మెంట్ తీసుకోవడానికి జర్మనీలో ఉన్న సంగతి తెలిసిందే. 
 
మహేష్ త్వరలో రాజమౌళితో కలిసి పని చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ఉగాది రోజున ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. కెఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ అడ్వెంచర్ డ్రామాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నంబర్ గేమ్ నమ్మను - కెప్టెన్ మిల్లర్ లాంటి కథను నమ్ముతా : ప్రియాంక అరుల్ మోహన్