Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌'... విజయం కోసం యాత్ర

''సినిమా రిలీజ్‌ అయిన తొలి రోజు కలెక్షన్స్‌ విషయంలో మేం అనుకున్న భారీ ఓపెనింగ్స్‌ రాలేదు. కానీ నెమ్మదిగా పుంజుకుంది. తొలిరోజు కంటే రెండో రోజు 20 శాతం కలెక్షన్స్‌ పెరిగాయి. మూడో రోజు మొదటిరోజు కలెక్షన్

Advertiesment
'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌'... విజయం కోసం యాత్ర
, సోమవారం, 19 డిశెంబరు 2016 (16:42 IST)
''సినిమా రిలీజ్‌ అయిన తొలి రోజు కలెక్షన్స్‌ విషయంలో మేం అనుకున్న భారీ ఓపెనింగ్స్‌ రాలేదు. కానీ నెమ్మదిగా పుంజుకుంది. తొలిరోజు కంటే రెండో రోజు 20 శాతం కలెక్షన్స్‌ పెరిగాయి. మూడో రోజు మొదటిరోజు కలెక్షన్స్‌కు రెట్టింపయ్యాయి. ఈ సక్సెస్‌ను ప్రేక్షకులతో పంచుకోవడానికి సిద్ధమైయ్యాం. అందుకనే మంగళవారం నుంచి కరీంనగర్‌ నుంచి శ్రీకాకుళం వరకు సక్సెస్‌ టూర్‌ ప్లాన్‌ చేశాం. ఈ టూర్‌లో యూనిట్‌ అంతా పాల్గొని ప్రేక్షకులకు థాంక్స్‌ చెబుతామని'' నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ అన్నారు.
 
లక్కీ మీడియా బ్యానర్‌పై భాస్కర్‌ బండి దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌'.  రావు రమేష్‌, హెబ్బా పటేల్‌, తేజస్వి మడివాడ, అశ్విన్‌, పార్వతీశం, నోయెల్‌ సేన్‌ ప్రధాన తారాగణంగా నటించారు. సోమవారం ఫిలింఛాబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్‌పి. పట్నాయక్‌ మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దు సినిమాకు తొలిరోజు కలెక్షన్స్‌ పరంగా ఎఫెక్ట్‌ పడింది. 
 
అమ్మాయి ప్రేమిస్తే ఒకే కానీ ఇలాంటి ఓ ప్రేమకథను చేయాలంటే గట్స్‌ ఉండాలి. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఆడియెన్స్‌ కన్విన్స్‌ చేసేలా చెప్పిన టీంను అభినందిస్తున్నానని' తెలిపారు. 'ఈ ఏడాది నేను చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్‌ అయ్యింది. ఈ సినిమా సక్సెస్‌తో సక్సెస్‌ఫుల్‌ ఇయర్‌గా ముగింపు రావడం ఎంతో సంతోషంగా ఉందని' హెబ్బా పటేల్‌ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయిధరమ్‌తేజ్‌, రాజ్‌తరుణ్‌లు మిస్‌ అయిన కథ : నిర్మాత దిల్ రాజు