Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాయిధరమ్‌తేజ్‌, రాజ్‌తరుణ్‌లు మిస్‌ అయిన కథ : నిర్మాత దిల్ రాజు

నేను ఫ్యామిలీ సినిమాలే తీస్తాను. దాన్ని ఆదరిస్తున్నారు. వేగ్నేష సతీష్‌కు ఈ కథ ఐడియాకు వచ్చినప్పుడు నాకు చెప్పాడు. మనమైనా, మన తల్లిదండ్రులైనా, లేదా మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు పల్లెటూరు నుండి వచ్చినవారే.

సాయిధరమ్‌తేజ్‌, రాజ్‌తరుణ్‌లు మిస్‌ అయిన కథ : నిర్మాత దిల్ రాజు
, సోమవారం, 19 డిశెంబరు 2016 (16:26 IST)
నేను ఫ్యామిలీ సినిమాలే తీస్తాను. దాన్ని ఆదరిస్తున్నారు. వేగ్నేష సతీష్‌కు ఈ కథ ఐడియాకు వచ్చినప్పుడు నాకు చెప్పాడు. మనమైనా, మన తల్లిదండ్రులైనా, లేదా మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు పల్లెటూరు నుండి వచ్చినవారే. ఈ ఫాస్ట్‌లైఫ్‌లో పడి మనం చాలా ఎమోషన్స్‌ను మిస్‌ అయిపోతున్నాం. అందుకే ఈ మూడు జనరేషన్స్‌ మధ్య జరిగే కథ అని తెలియగానే ఎగ్జైట్‌ అయ్యాను. ఈ కథకు సాయిధరమ్‌తేజ్‌, రాజ్‌తరుణ్‌ పేర్లను అనుకున్నాం. కానీ వారి డేట్స్‌ కుదరలేదు. దాంతో.. శర్వానంద్‌కు తీసుకున్నట్టు చిత్ర నిర్మాత దిల్ రాజు చెప్పారు. 
 
కథను ఎంత ప్యాషన్‌గా తీసుకున్నానో, సినిమాలో పనిచేసి ప్రతి ఒక ఆర్టిస్ట్‌, టెక్నిషియన్‌ అంతే ప్యాషన్‌గా తీసుకోవడం వల్ల సినిమా చాలా త్వరగా పూర్తయింది. సినిమా సంక్రాంతికి విడుదల కావాలి. అయితే శర్వానంద్‌ మరో సినిమా చేయకుండా మంచి కథ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. నాకు, శర్వాకు మధ్య పన్నెండేళ్ల క్రితం నుండి మంచి రిలేషన్‌ ఉంది. అందువల్ల ఈ కథకు శర్వానంద్‌ అయితే సరిపోతాడనిపించి నేను యుఎస్‌ వెళ్లినప్పుడు శర్వానంద్‌ యుఎస్‌లోనే ఉన్నాడు. అయితే నేను ఫోన్‌లోనే తనకు 15 నిమిషాల పాటు కథ చెప్పాను. కథ నచ్చింది కానీ ఫ్యామిలీ స్టోరీ కదా.. పూర్తి కథ వింటానని అన్నాడు. 
 
కథ విన్నాను.., కథ సూపర్బ్‌గా ఉంది నేను సినిమా చేస్తానని అన్నాడు. అలా అందరినీ సెలక్ట్‌ చేసుకుని సినిమాను పూర్తి చేశాం. మిక్కి ఎక్సలెంట్‌ మ్యూజిక్‌ అందించాడు. రామజోగయ్యశాస్త్రి, శ్రీమణిగారు చాలా మంచి సాహిత్యానందించారు. కొత్త సినిమా అని చెప్పను కానీ.. ప్రతి మూమెంట్‌ బ్యూటీఫుల్‌గా ఉంటుంది. పల్లెటూర్లో పుట్టిన ప్రతివారు ఒకసారి వెనక్కి వెళతారు. మన స్మృతులను గుర్తు చేసుకునేలా సినిమా రూపొందింది. సంక్రాంతికి సినిమాను అందిస్తున్నాం'' అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రకాష్‌రాజ్‌తో నటించడం గర్వంగా ఉంది: జయసుధ