Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాని, అనుష్క ఒకే సినిమాలో.. హీరోహీరోయిన్స్‌గా కనిపిస్తారా?

నేచురల్ స్టార్ నాని, బాహుబలి దేవసేన అనుష్క ఒకే సినిమాలో నటిస్తున్నారట. ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తున్నారా? నిజమేనా? ఇద్దరూ హీరోహీరోయిన్లుగా కనిపిస్తారనే కదూ అనుకుంటున్నారు.. అలా అనుకుంటే పప్పులో కాలేసి

Advertiesment
నాని, అనుష్క ఒకే సినిమాలో.. హీరోహీరోయిన్స్‌గా కనిపిస్తారా?
, మంగళవారం, 17 జులై 2018 (13:19 IST)
నేచురల్ స్టార్ నాని, బాహుబలి దేవసేన అనుష్క ఒకే సినిమాలో నటిస్తున్నారట. ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తున్నారా? నిజమేనా? ఇద్దరూ హీరోహీరోయిన్లుగా కనిపిస్తారనే కదూ అనుకుంటున్నారు.. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. 
 
అసలు సంగతి ఏమిటంటే.. విభిన్నమైన కథా చిత్రాల దర్శకుడిగా చంద్రశేఖర్ యేలేటి మార్కు కొట్టేశాడు. ఐతే, అనుకోకుండా ఒకరోజు, మనమంతా సినిమాల ద్వారా యేలేటి సక్సెస్ సాధించాడు. తాజాగా మరో ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. 
 
కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఓ కథను యేలేటి సిద్ధం చేసుకుంటున్నారని.. ఈ పాత్ర కోసం బాహుబలి దేవసేన, స్వీటీ అయిన భాగమతిని అదేనండీ అనుష్కను సంప్రదించారని టాక్. యేలేటి కథ నచ్చడంతో ఇందులో నటించేందుకు అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 
 
ఇలా 'భాగమతి' తరువాత అనుష్క ఓకే చెప్పిన కథ ఇది. ఈ సినిమాలో ఒక కీలకమైన అతిథి పాత్ర ఉందట. ఈ పాత్రను నాని చేస్తే బాగుంటుందని భావించిన చంద్రశేఖర్ యేలేటి ఇటీవలే ఆయనను కలిశారని సమాచారం. పాత్రలోని కొత్తదనం నచ్చడం వలన నాని కూడా ఈ సినిమాలో అతిథి రోల్ పోషించేందుకు ఓకే చెప్పాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం నాని బిగ్ బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#100DaysToKingPRABHASBday హ్యాష్‌ట్యాగ్‌పై సిద్ధార్థ్ వెటకారం..?