Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

ద‌స‌రా సంద‌ర్భంగా నాని- శ్యామ్ సింఘరాయ్ లుక్‌

Advertiesment
Nani
, గురువారం, 14 అక్టోబరు 2021 (16:33 IST)
Shyam Singharai Look
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింఘరాయ్ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రాహుల్  సంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ పార్ట్ అద్భుతంగా ఉండబోతోంది. అందుకే  పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పట్టనుంది.
 
ఇప్పటికే విడుదలైన శ్యామ్ సింఘరాయ్‌గా నాని ఫస్ట్ లుక్‌కు ఎంతటి స్పందన వచ్చిందో అందరికీ తెలిసిందే. సాయి పల్లవి, కృతి శెట్టిల పాత్రలను రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లు అద్భుతమైన స్పందనను దక్కించుకున్నాయి. ఇక దసరా సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త  పోస్టర్ విడుదల చేసింది. ఇందులో వాసు పాత్రలోని నాని లుక్కును రివీల్ చేశారు. మిక్కీ జే మేయర్ తన సంగీతంతో రెండు పాత్రల్లోనూ వేరియేషన్స్‌ను చూపించారు.
 
వెనకాల కాళీమాత విగ్రహం, ముందు నాని ఉన్న ఈ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.  ఎంతో పవర్ఫుల్‌గా ఉన్న ఈ పోస్టర్‌ నాని అభిమానులకు ఐ ఫీస్ట్‌లా ఉంది.  వాసు పాత్రలో నానీని ఎంతో ఇంటెన్సిటీని చూపించడంతో పోస్టర్‌పై అందరి దృష్టి పడింది. ఈ చిత్రంలో నాని బెంగాలీ కుర్రాడిగా శ్యామ్ సింఘరాయ్ పాత్రలో కనిపిస్తారు. అదే సమయంలో వాసుగా గుబురు గడ్డం, వెరైటీ హెయిర్ స్టైల్‌తో మెప్పించనున్నారు.
 
అతని ప్రేమ, అతని వారసత్వం, అతని మాట అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ విడుదల చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల కాబోతోందని ప్రకటించారు. విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు భారీ స్థాయిలో టీం కష్టపడుతోంది. క్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
 
నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా రాబోతోన్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
నటీనటులు : నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'దండుపాళ్యం' గ్యాంగ్‌తో 'తగ్గేదే లే': టీజర్ అవుట్ (video)