Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాని- శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ సింగిల్ రైజ్ ఆఫ్ శ్యామ్

Advertiesment
నాని- శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ సింగిల్ రైజ్ ఆఫ్ శ్యామ్
, శనివారం, 30 అక్టోబరు 2021 (17:26 IST)
Shyam Singa Roy
నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అన్ని వర్గాల వారి నుండి సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి.
 
నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌పై వెంకట్ బోయనపల్లి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రయూనిట్ ఇప్పుడు సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించేసింది.
 
రైజ్ ఆఫ్ శ్యామ్ అంటూ విడుదల చేయనున్న ఈ లిరికల్ వీడియో ప్రోమో  అందరినీ ఆకట్టుకుంటుంది.  నవంబర్ 6న ఈ ఫస్ట్ సింగిల్ రాబోతోందని ప్రకటించారు. శ్యామ్ పాత్రకు సంబంధించిన కారెక్టరైజేషన్ గురించి వివరిస్తూ ఆ పాట సాగుతుంది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ లో కుర్చీలో  కూర్చుని చేతిలో సిగరెట్ పట్టుకుని, అలా సీరియస్ లుక్కుతో నాని కనిపిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఆడియో ప్రమోషన్స్ ప్రారంభించేందుకు అదే పర్ఫెక్ట్ సాంగ్ అనిపిస్తోంది.
 
సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు.
 
రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
 
భారీ స్థాయిలో వీఎఫెఎక్స్‌తో  రాబోతోన్న ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో విడుదలవుతోంది. ఈ  చిత్రం క్రిస్మస్ కానుకగా.. తెలుగు తమిళ కన్నడ మళయాల భాషల్లో డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.
 
నటీనటులు : నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు హీరోల‌ను ఆలోచించేలా చేసిన‌ పునీత్ రాజ్‌కుమార్ హ‌ఠాన్మర‌ణం