Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నందుల రచ్చ... పెరుగుతున్న నిరసన జ్వాలలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై చెలరేగిన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ నిరసన జ్వాలలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. నంది అవార్డులపై రగడ నడుస్తూనే ఉంది.

నందుల రచ్చ... పెరుగుతున్న నిరసన జ్వాలలు
, ఆదివారం, 19 నవంబరు 2017 (10:34 IST)
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై చెలరేగిన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ నిరసన జ్వాలలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. నంది అవార్డులపై రగడ నడుస్తూనే ఉంది. తమ చిత్రానికి నంది పురస్కారం దక్కకపోవడంతో "రుద్రమదేవి" చిత్ర నిర్మాత, దర్శకుడు గుణశేఖర్‌ జ్యూరీపై బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, జ్యూరీ సభ్యులు కూడా సోషల్‌ మీడియాలో తమను విమర్శించే వారిపై ఎదురుదాడికి దిగారు. ఫలితంగా నందుల వివాదం మరింతగా ముదురుతోంది. 
 
ఈనెల 14వ తేదీన ఏపీ సర్కారు 2014, 15, 16 సంవత్సరాలకుగాను ఒకేసారి నంది పురస్కారాలను ప్రకటించింది. ఈ పురస్కారాలపై మొదటి నుంచి తీవ్ర దుమారం చెలరేగింది. అది ఇంకా నడుస్తూనే ఉంది. చిత్రపరిశ్రమకు చెందిన కొంతమంది తమ చిత్రాలకు నంది పురస్కారాలు దక్కకపోవడంతో జ్యూరీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
నంది అవార్డులపై దర్శకుడు గుణశేఖర్‌ మొదటి నుంచి విమర్శలు గుప్పిస్తున్నారు. శనివారం మరోసారి నంది పురస్కారాలపై స్పందించారు. నంది అవార్డుల వెనుక రాజకీయం ఉందని ఆరోపిస్తూ, తన వెనుక మాత్రం ఏ శక్తీ లేదని స్పష్టం చేశారు. మహిళా సాధికారతపై తాను తీసిన రుద్రమదేవి చిత్రానికి అవార్డు దక్కకపోవడం బాధాకరమన్నారు. 
 
నటి జీవిత కామెంట్స్‌పైనా గుణశేఖర్‌ స్పందించారు. జీవిత అంటే తనకు చాలా గౌరవం ఉండేదని... అవార్డుల ప్రకటన విడుదల చేసిన తర్వాత ఆమె చంద్రబాబు, టీడీపీ గురించి మాట్లాడారన్నారు. చంద్రబాబు అవకాశమిస్తే టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారని... ఆ ఒక్కమాటతో ఆమెపైనున్న గౌరవం, నమ్మకం పోయిందన్నారు. 
 
ఇకపోతే, నంది అవార్డులపై వస్తున్న విమర్శలపై హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. 'లెజెండ్' అనేది మామూలు టైటిల్‌ కాదని.. అది పెట్టినప్పుడే కాంట్రవర్సీలు వచ్చాయన్నారు. అయినా తమ 'లెజెండ్‌' చిత్రం మాటలతో కాదు... చేతలతో చూపించిందంటూ చెప్పుకొచ్చారు. తాను నటించిన 'లెజెండ్‌'కు 9నంది అవార్డులు దక్కడం చాలా గర్వంగా ఉందన్నారు. అందరి సమష్టికృషి వల్లే ఇది సాధ్యమైందని చెప్పి, తమ సర్కారు అనుసరించిన తీరు కరక్టేనని బాలయ్య చెప్పకనే చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'లెజెండ్' మామూలు చిత్రం కాదు.. అందుకే నందుల పంట : బాలకృష్ణ