Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నందమూరి బాలకృష్ణ NBK107 కీలక షెడ్యూల్ ఇస్తాంబుల్‌లో ప్రారంభం

Balakrishna, Shruti Haasan, Gopichand Malineni
, మంగళవారం, 30 ఆగస్టు 2022 (16:18 IST)
Balakrishna, Shruti Haasan, Gopichand Malineni
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్  ఎంటర్‌టైనర్‌  #NBK107 షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా కీలకమైన షూటింగ్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ టర్కీలోని ఇస్తాంబుల్ వెళ్ళింది. ఇక్కడ సినిమాలోని ప్రముఖ తారాగణంతో కీలక భాగాన్ని చిత్రీకరించనున్నారు.
 
దర్శకుడు గోపీచంద్ మలినేని షూటింగ్ లొకేషన్ నుండి బాలకృష్ణ, శ్రుతి హాసన్‌లతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ ఎక్సయిట్ మెంట్ ఈ ముగ్గురిలో కనిపిస్తోంది. టాకీ పార్ట్ కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు.
 
మేకర్స్ ఇటివలే బాలకృష్ణ పుట్టినరోజున రెండు బ్యాక్-టు-బ్యాక్ ట్రీట్‌లను అందించారు. ఫస్ట్ హంట్ వీడియో, ఆపై మాస్ పోస్టర్ విడుదల చేశారు. ఈ రెండింటికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.
 
ఈ చిత్రంలో దునియా విజయ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా  రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.
 
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.  స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.
 
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.
 
సాంకేతిక విభాగం- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: థమన్
డివోపీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
సిఈవో: చిరంజీవి (చెర్రీ)
కో-డైరెక్టర్: కుర్రా రంగారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: వంశీ-శేఖర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"లైగర్" నుంచి రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్