Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

Advertiesment
Adithya 369
Adithya 369
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’  4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో ఏప్రిల్ 4న రీ రిలీజ్ కానుంది. 1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా మార్చి 30, ఉగాది రోజున నందమూరి బాలకృష్ణ తో సహా చిత్రంలోని నటీ నటులు, సాంకేతిక నిపుణులతో హైదరాబాద్ లో రీ- రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్.
 
ఈ సందర్బంగా  శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ “నందమూరి బాలకృష్ణ గారు రెండు విభిన్న పాత్రల్లో అలరించి, మా సంస్థకి భారీ విజయాన్ని, చిరస్మరణీయ గుర్తింపుని అందించిన "ఆదిత్య 369" చిత్రాన్ని ఏప్రిల్ 4న రీ-రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ సంతోషాన్ని పంచుకోవడానికి మా నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియా సమక్షంలో ఈ ఉగాదికి రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశాము. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమాను తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారు. చక్కని థియేటర్లు కూడా లభించడంతో వైభవంగా రీ-రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం