నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369 మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. 1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాను 4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో మరింత అధునాతనంగా మళ్ళీ ప్రేక్షకులకు అందిస్తున్నారు.
శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ - “నందమూరి బాలకృష్ణ గారు శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా రెండు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమాను తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారు. ఇప్పటి టెక్నికల్ హంగులతో మరింత గొప్ప అనుభూతిని అందించేలా రీ రిలీజ్‌కి సిద్ధమైంది. చక్కని థియేటర్లు లభించడంతో, ముందుగా అనుకున్న ఏప్రిల్ 11న కాకుండా ఏప్రిల్ 4వ తేదీనే రీ రిలీజ్ చేయాలని నిర్ణయించాం అన్నారు.