Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Balakrishna : అఖండ 2లో శివుడు గెటప్ వేసిన నందమూరి బాలక్రిష్ణ - తాజా అప్ డేట్

Advertiesment
Nandamuri Balakrishna Shiva getup, fans creation

దేవీ

, సోమవారం, 17 మార్చి 2025 (12:42 IST)
Nandamuri Balakrishna Shiva getup, fans creation
నందమూరి బాలక్రిష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం అఖండ 2 – తాండవం. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా, ఈ సినిమా పై తాజా అప్ డేట్ వచ్చింది. అఘోర పాత్ర పోషిస్తున్న బాలయ్య, హిమాలయాల్లో శివలింగానికి అభిషేకం చేస్తూ ఆయన పాత్ర రివీల్ అవుతుందని తెలుస్తోంది. ఈ సీన్ కు కంటెన్యూగా కీలక సన్నివేశాన్ని హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ శంకరపల్లిలోని ఓమ్ స్టూడియోలో వేసిన సెట్లో తాజా షూటింగ్ జరుగుతోంది.
 
నేడు నందమూరి బాలక్రిష్ణ షూట్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆయన శివుడి గెటప్ లో వున్నట్లు తెలిసింది. ఈ గెటప్ చూసిన షూటింగ్ లోని వారంతా ఆయన నిజంగా శివునిలాగే వున్నారంటూ ఆయనను నమస్కరిస్తూ షూట్ చేస్తున్నారట. ఈరోజు కొంతమంది పైటర్లతో శివుని గెటప్ లో బాలయ్య యాక్షన్ సీన్స్ చేస్తున్నారట. దర్శకుడు బోయపాటి శీను కూడా బాలయ్యకు నమస్కరిస్తూ, రెడీ, యాక్షన్, స్టాట్ అంటూ అనగానే ఫైటర్లు ఆయనముందు రావడం సీన్లు తీయడం జరిగింది. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  నందమూరి తేజస్వినీ చిత్ర సమర్పురాలిగా వ్యవహరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెట్టింగుల యాప్‌ల వల్ల బాగుపడిన చరిత్ర లేదు.. ప్లీజ్ వాటి జోలికెళ్లొద్దు : సంపూర్ణేష్ (Video)