కెరీర్ గ్రాఫ్ ముందంజలోని హీరో నాగ చైతన్య. తన గ్రాఫ్‌ను పెంచుకునేందుకు పలు ప్రయోగాలు చేస్తూనే వున్నాడు. తాజాగా మలయాళం 'ప్రేమమ్' చిత్రం రీమేక్‌లో నటిస్తున్నాడు.
ఈ చిత్రం అక్కడ సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది. తెలుగులో కూడా సాధిస్తుందనే ఆశతో కొన్ని మార్పులు చేర్పులు చేసి తీస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏమంటే.. వెంకటేష్ ఓ పాత్రలో నటిస్తుండటం.
వరుసకు మామ అయిన వెంకటేష్ నాగచైతన్య చిత్రంలో చేయడం విశేషమే. మరో ప్రత్యేకత ఏమంటే. తండ్రి నాగార్జున ఈ చిత్రానికి వాయిస్‌ఓవర్ చేస్తున్నారు. సో.. ఇద్దరు హీరోల సపోర్ట్ నాగచైతన్యకు లాభిస్తుందేమో చూడాలి.