Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భరత్‌ దర్శకత్వంలో 'గండ్ర గొడ్డలి' (ఆవు చంపిన పులి నెత్తురు) ప్రారంభం

భరత్‌ దర్శకత్వంలో 'గండ్ర గొడ్డలి' (ఆవు చంపిన పులి నెత్తురు) ప్రారంభం
, ఆదివారం, 1 మే 2016 (17:58 IST)
ప్రముఖ దర్శకుడు భరత్‌ దర్శకత్వంలో ఓ విభిన్న చిత్రం ప్రారంభమైంది. 'గండ్ర గొడ్డలి(ఆవు చంపిన పులి నెత్తురు) పేరుతో ఎ.సతీష్‌ సమర్పణలో సి.బి.డి.టి. ప్రొడక్షన్స్‌ పతాకంపై డి.ఎ.ఎస్‌.పటేల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెయిన్‌ విలన్‌గా నటిస్తున్న చిల్లర రాంబాబు, శేఖర్‌, విజయ్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి.ఎ.ఎస్‌.పటేల్‌ క్లాప్‌నివ్వగా, సహనిర్మాతలు సంతోష్‌కుమార్‌, కిశోర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. 
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు భరత్‌ మాట్లాడుతూ - ''గతంలో వచ్చిన 'ప్రతిఘటన' చిత్రం ఎంత పవర్‌ఫుల్‌గా వుంటుందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం కంటే పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో ఈ చిత్రం రూపొందుతుంది. పాత, కొత్త నటీనటులతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా నూతన హీరో, హీరోయిన్‌లను పరిచయం చేస్తున్నాం. ఈ చిత్రానికి మరుధూరి రాజా అద్భుతమైన మాటలు రాశారు. వరంగల్‌ శ్రీనివాస్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులతో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను మే రెండో వారంలో స్టార్ట్‌ చేస్తున్నాం'' అన్నారు. 
 
ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, సంగీతం: వరంగల్‌ శ్రీనివాస్‌, సహ నిర్మాతలు: సంతోష్‌కుమార్‌, కిషోర్‌, నిర్మాత: డి.ఎ.ఎస్‌.పటేల్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భరత్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్న"బంతిపూల జానకి"