Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్న"బంతిపూల జానకి"

పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్న
, ఆదివారం, 1 మే 2016 (17:56 IST)
ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై నిర్మాణమవుతున్న "బంతిపూల జానకి" చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. ధన్ రాజ్-దీక్షపంత్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో కల్యాణి-రామ్-తేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షకలక శంకర్, అదుర్స్ రఘు, వేణు, రాకెట్ రాఘవ, చమక్ చంద్ర, డా. భరత్ రెడ్డి, సుడిగాలి సుదీర్ ఈ చిత్రంలో ఇతర ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
 
దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ.. "హాస్యానికి పెద్ద పీట వేస్తూ రూపొందిస్తున్న మా "బంతిపూల జానకి" ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. మే మూడవ వారంలో ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రం కోసం మా మ్యూజిక్ డైరెక్టర్ బోలె బ్రహ్మాండమైన బాణీలు ఇవ్వడంతో పాటు రీ-రికార్డింగ్ తో సినిమాకు జీవం పోస్తున్నారు. ఇక మా హీరో ధన్ రాజ్ మరియు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ వేసవిలో వినోదాల తొలకరి జల్లు కురిపించనున్న "బంతిపూల జానకి".. ఈ ఏడాది పెద్ద విజయం సాధించే చిన్న చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని కచ్చితంగా చెప్పగలను" అన్నారు. 
 
ఫణి, నాగి, జీవన్, అవినాష్, కోమలి, భాను, ప్రియ, చాందిని, దేవీప్రియ, దేవిక తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి.. కెమెరామేన్: జి.లింగబాబు, పాటలు: కాసర్ల శ్యాం, సంగీతం: బోలె, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్, నిర్మాతలు: కల్యాణి-రామ్-తేజ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్!!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాల్-వరలక్ష్మిల ''మదగజరాజ'' రిలీజ్ ఎప్పుడు?: సదా స్పెషల్ సాంగ్..!