Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిబ్రవరిలో బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవం... సిద్ధమవుతున్న నాగార్జున

బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం వచ్చే నెలలో జరుగనుంది. ఇందుకోసం టాలీవుడ్ హీరో నాగార్జున సిద్ధమవుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రయోగాత్మక కమర్షియల్ చిత్రాల్లో నటించి తనదైన ముద్రవేసిన హీరో ఈ టాలీవుడ్

Advertiesment
Nagarjuna's Om Namo Venkatesaya Movie
, గురువారం, 5 జనవరి 2017 (12:00 IST)
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం వచ్చే నెలలో జరుగనుంది. ఇందుకోసం టాలీవుడ్ హీరో నాగార్జున సిద్ధమవుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రయోగాత్మక కమర్షియల్ చిత్రాల్లో నటించి తనదైన ముద్రవేసిన హీరో ఈ టాలీవుడ్ మన్మథుడు. అదే తరహాలో భక్తిరస పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి వాటికి ప్రాణప్రతిష్ట చేశారు. తాజాగా నాగార్జున నటిస్తున్న భక్తిరసప్రధాన చిత్రం "ఓం నమో వెంకటేశాయ". 
 
శ్రీనివాసుడి పరమభక్తుడైన హథీరామ్ బాబా జీవిత కథకు ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తున్నారు. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఎ.మహేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ 16 శతాబ్దంలో కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరుని పరమభక్తుడిగా నీరాజనాలందుకున్న హాథీరామ్‌బాబా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. ఈ నెల 8న పాటల్ని విడుదల చేస్తున్నాం. 
 
ఈ సినిమాలో వెంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క నటిస్తోంది. ప్రతి ఒక్కరిలోనూ భక్తిభావనలు పెంపొందించేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాం అన్నారు. జగపతిబాబు, ప్రగ్యాజైస్వాల్, విమలారామన్ తదితరులు నటిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలయ్య శాతకర్ణిగా.. చిరంజీవి ఖైదీగా పోటీపడాలి.. అప్పుడే..?: దాసరి.. నోట్ల రద్దుపై ఇంకా ఏమన్నారు?