Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలయ్య శాతకర్ణిగా.. చిరంజీవి ఖైదీగా పోటీపడాలి.. అప్పుడే..?: దాసరి.. నోట్ల రద్దుపై ఇంకా ఏమన్నారు?

సంక్రాంతికి అగ్ర హీరోల సినిమాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. బాలయ్య శాతకర్ణిగా, మెగాస్టార్ చిరంజీవి ఖైదీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలపై దర్శకరత్న దాసరి నారాయణరావు స్పందించారు. తన కెర

బాలయ్య శాతకర్ణిగా.. చిరంజీవి ఖైదీగా పోటీపడాలి.. అప్పుడే..?: దాసరి.. నోట్ల రద్దుపై ఇంకా ఏమన్నారు?
, గురువారం, 5 జనవరి 2017 (11:31 IST)
సంక్రాంతికి అగ్ర హీరోల సినిమాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. బాలయ్య శాతకర్ణిగా, మెగాస్టార్ చిరంజీవి ఖైదీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలపై దర్శకరత్న దాసరి నారాయణరావు స్పందించారు. తన కెరీర్‌లో దర్శకుడు రాఘవేంద్ర రావుతో ఎంత ఆరోగ్యకరంగా పోటీ పడ్డానో టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, బాలకృష్ణ మధ్య అంతే ఆరోగ్యకరమైన పోటీ ఉందని దాసరి వ్యాఖ్యానించారు. 
 
సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీ ప్రతి రంగంలోనూ ఉంటుందని తెలిపారు. సంక్రాంతి సీజన్‌లో ఒకరి సినిమాలు మరొకరికి పోటీ కాదని తెలిపారు. తొలి రోజు ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరో సినిమా చూస్తారని, రెండో రోజు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కలిసి ఒక సినిమా చూస్తారని చెప్పుకొచ్చారు.
 
నోట్ల రద్దుపై దాసరి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ సాధ్యం కావని అన్నారు. వివిధ రంగాలతో సమన్వయం చేసే క్రమంలో చెక్కులిస్తామంటే ఎవరూ పని చేయరని, ప్రధానంగా సినీ పరిశ్రమలో చెక్కులను ఎవరూ నమ్మరని ఆయన అన్నారు. డీమోనిటైజేషన్ అనాలోచిత చర్య అని, దేశాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని వెల్లడించారు. 
 
ఇక ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి దాసరి మాట్లాడుతూ.. చిరంజీవి కెరీర్‌లో విజయవంతమైన సినిమాలన్నింటికీ తానే ముఖ్య అతిథిగా హాజరయ్యానని చెప్పుకొచ్చారు. చిరంజీవి ఫంక్షన్ అంటే తనకు సొంత ఫంక్షన్ అని చెప్పుకొచ్చారు. చిరంజీవి అగ్రస్థాయి నటుడని కొనియాడారు. తనకు అవసరమైన స్టార్ డమ్ ఇప్పటికే సంపాదించేశాడని, కొత్తగా అవసరం లేదని వెల్లడించారు. 
 
చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు కూడా అంతే కష్టపడ్డాడని ఆయన తెలిపారు. అతని కష్టం గురించి చాలా విన్నానని ఆయన తెలిపారు. విభేదాలు, భేదాభిప్రాయాలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయని అన్నారు. తన 50 ఏళ్ల కెరీర్‌లో హీరోలందరినీ చూస్తూ వచ్చానని, ఒకవేళ వారిని తానేదైనా అన్నా వారు సీరియస్‌గా తీసుకోరన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వచ్చాడు! వచ్చాడు.. సైడ్‌ ఇవ్వండి బాసు! అంటోన్న చిరంజీవి