Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాన్నకు చైతూ-సమ్మూ ప్రేమ అప్పుడే తెలిసిపోయిందేమో.. వాళ్ళ పెళ్ళి వాళ్ల ఇష్టమే: నాగ్

'ఓం నమో వేంకటేశాయ' ప్రమోషన్‌లో భాగంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున ఆసక్తికర అంశాలను బయటపెట్టారు. హీరోయిన్ సమంత తన ఇంటి కోడలు అవుతుందని తన తండ్రి.. అలనాటి తార అక్కినేని నాగేశ్వర రావుకు ముందే

నాన్నకు చైతూ-సమ్మూ ప్రేమ అప్పుడే తెలిసిపోయిందేమో.. వాళ్ళ పెళ్ళి వాళ్ల ఇష్టమే: నాగ్
, బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (13:33 IST)
'ఓం నమో వేంకటేశాయ' ప్రమోషన్‌లో భాగంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున ఆసక్తికర అంశాలను బయటపెట్టారు. హీరోయిన్ సమంత తన ఇంటి కోడలు అవుతుందని తన తండ్రి.. అలనాటి తార అక్కినేని నాగేశ్వర రావుకు ముందే తెలుసనిపిస్తోందని చెప్పారు. 'మనం' చిత్రం క్లైమాక్స్‌ను ప్రస్తావిస్తూ, చివరి సీన్‌లో తనతో పాటు నాన్న, సమంత, నాగచైతన్య, అఖిల్, శ్రియ ఉన్నారని గుర్తు చేశారు.

అఖిల్ భార్య పేరు శ్రియ అని, నాగచైతన్య, సమంత ఒకటి కాబోతున్నారని ఆ విధంగా చిత్రంలో ఉన్న పాత్రలతో తమ గ్రూప్ ఫోటో అయిపోయిందని చెప్పుకొచ్చారు. నాన్నగారు ఉండటంతో చైతూ-సమ్మూ బయటపడలేదని.. తనతో మాత్రం ఫ్రెండ్లీగా ఉండేవారని నాగ్ తెలిపారు. 
 
మనం సినిమా షూటింగ్‌లో చైతూ, సమంత కలిసి చేసిన సీన్స్ తక్కువగా ఉన్నప్పటికీ.. తాను ఉన్న సమయంలో వాళ్లిద్దరూ కుదురుగానే ఉండేవారని నాగ్ వ్యాఖ్యానించారు. అందుకే వారి మధ్య లవ్ ట్రాక్ ఉన్నట్లు తెలియదని, ఒక విధంగా తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ, తనకు సంబంధాలు వెతికే శ్రమను చైతూ తగ్గించాడని చెప్పుకొచ్చారు.
 
ఇకపోతే జనవరి ఎండ్‌లో సమంత-చైతూల నిశ్చితార్థం జరిగింది. అది వారి ఇష్ట ప్రకారం జరిగింది. అలాగే పెళ్ళి విషయంలోనూ. నాగ చైతన్య, సమంతలు ఎక్కడ, ఎప్పుడు వివాహం చేసుకుంటామన్నా తాము సిద్ధమేనని అక్కినేని నాగార్జున చెప్పారు.  త్వరలో విడుదల కానున్న ఓం నమో వేంకటేశాయ చిత్రం గురించి ప్రస్తావిస్తూ, వెంకటేశ్వరుడి భక్తుడు అయిన హాథీరాం బావాజీ గురించి ఎక్కువగా తెలియదని, ఆయన గురించి తెలుసుకోవడానికి దేశ వ్యాప్తంగా ఉన్న మఠాలన్నీ చిత్ర బృందం తిరిగిందని చెప్పారు. ఈ చిత్రంలో తన పాత్రకు, వెంకటేశ్వరుడి పాత్రధారికి మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్ కోసం ఎగబడ్డ హైదరాబాద్ అమ్మాయిలు... బన్నీ సీరియస్‌, కానీ ఒకమ్మాయి పెట్టేసిందట...