Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్లు అర్జున్ కోసం ఎగబడ్డ హైదరాబాద్ అమ్మాయిలు... బన్నీ సీరియస్‌, కానీ ఒకమ్మాయి పెట్టేసిందట...

నటుడు అల్లు అర్జున్‌ తనతో నటిస్తున్న కొందరి అమ్మాయిలపై సీరియస్‌ అయినట్లు తెలిసింది. తాజాగా ఆయన నటిస్తున్న 'దువ్వాడ జగన్నాథమ్‌' సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అందుకోసం కొందరు మోడల్స్‌ను పిలిపించారు. చిత్ర కథలో బాగంగా సంగీత్‌ సీన్‌ చేస్తున్నారు. ముంబైకు

అల్లు అర్జున్ కోసం ఎగబడ్డ హైదరాబాద్ అమ్మాయిలు... బన్నీ సీరియస్‌, కానీ ఒకమ్మాయి పెట్టేసిందట...
, బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (13:10 IST)
నటుడు అల్లు అర్జున్‌ తనతో నటిస్తున్న కొందరి అమ్మాయిలపై సీరియస్‌ అయినట్లు తెలిసింది. తాజాగా ఆయన నటిస్తున్న 'దువ్వాడ జగన్నాథమ్‌' సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అందుకోసం కొందరు మోడల్స్‌ను పిలిపించారు. చిత్ర కథలో బాగంగా సంగీత్‌ సీన్‌ చేస్తున్నారు. ముంబైకు చెందిన మోడల్స్‌తోపాటు హైదరాబాద్‌ యూనివర్శిటీలో చదువుతున్న విదేశీ యువతులు కూడా వచ్చారు. 
 
వారంతా సీన్‌ గ్యాప్‌లో అర్జున్‌ వద్దకు వచ్చి సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ఓసారి వారించినా వినకపోవడమే కాకుండా మూకమ్మడిగా రావడంతో చిర్రెత్తికొచ్చి.. మేనేజర్‌ను పిలిచి చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కూడా కలుగచేసుకుని... అసలు విషయాన్ని చెప్పాడు. ఇంతవరకు అర్జున్‌గారి లుక్‌ బయటకు పంపలేదు. ఇలా దిగితే ఇబ్బందని.. వారిని సముదాయించాడట. కాకపోతే.. అప్పటికే స్టిల్‌ గెటప్‌తో దిగిన ఓ అమ్మాయి ఫేస్‌బుక్‌లో పెట్టేయడంతో రచ్చరచ్చగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30 రోజుల లీవుకు- పెళ్ళికి లింకేంటి?