Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగ్ - నాని మూవీ వ‌చ్చేది ఎప్పుడు..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ భారీ చిత్రాన్ని వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పైన అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ

Advertiesment
నాగ్ - నాని మూవీ వ‌చ్చేది ఎప్పుడు..?
, గురువారం, 19 ఏప్రియల్ 2018 (18:15 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ భారీ చిత్రాన్ని వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పైన అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. నాగ్ స‌ర‌స‌న ఆకాంక్ష సింగ్ న‌టిస్తుంటే..నాని స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తున్నారు. అవ‌స‌రాల శ్రీనివాస్, సంపూర్ణేష్ బాబు ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు.
 
ఈ సినిమాకి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. అమెరికాలో పాట‌ల రికార్డింగ్ చేసారు. రామోజీ ఫిలింసిటీలో ఓ పాట‌ను చిత్రీక‌రించారు. ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను ఇటీవ‌లే ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో నాగ్ పైన కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఇద్ద‌రు హీరోలు షూటింగ్ ని జులైకి పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం... ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ను ఆగ‌ష్టులో రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''భరత్ అనే నేను'' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ 4/5.. రంగస్థలాన్ని?(Mahesh Video)