Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#MajiliFirstLook వచ్చేసింది..

Advertiesment
#MajiliFirstLook వచ్చేసింది..
, ఆదివారం, 30 డిశెంబరు 2018 (10:22 IST)
మజిలీ నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది. సమంత, చైతూ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మజిలీ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. పెళ్లికి తర్వాత చైతు, సామ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా వైజాగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఈ నెల 20 నుంచి హైదరాబాదులో కొత్త షెడ్యూల్‌ను మొదలెట్టింది. 
 
ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. తనికెళ్ళ భరణి, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
 
ఈ రొమాంటిక్ డ్రామాకు గోపీసుందర్ సంగీతం అందిస్తుండగా.. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌లో సాహు గరపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన తాజా లుక్ అదిరిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొండపైన కళ్యాణిని నలిపేశారు.. ఎవరు.. ఎందుకు.?(Video)