Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓటీటీలో థాంక్యూ.. 22వ తేదీ వచ్చేస్తుందా?

Advertiesment
Akkineni Nagachaitanya
, బుధవారం, 3 ఆగస్టు 2022 (16:00 IST)
అక్కినేని నాగచైతన్య రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రం థాంక్యూ. ఈ సినిమా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కింది. ఎన్నో అంచనాల నడుమ గత నెల 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో నాగచైతన్య 3 వేరియేషన్లలో కనిపించి సందడి చేశారు. 
 
ఇకపోతే థియేటర్స్ పూర్తి కావడంతో ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ కైవసం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ నుంచి అమేజాన్‌తో పాటు సన్ నెక్స్ట్‌లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.
 
ఇకపోతే ఈ విషయం గురించి మేకర్స్ అధికారిక ప్రకటన తెలియజేయాల్సి ఉంది. ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా ఈ నెల 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నాగచైతన్య ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాతో పాటు ఈయన దూత అనే వెబ్ సిరీస్‌లో నటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాల‌కృష్ణ‌, ఎన్‌.టి.ఆర్‌., క‌ళ్యాణ్ రామ్ క‌లిసి న‌టిస్తే!