Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలా అన్నందుకు సారీ... కావాలని అన్న మాటలు కాదు : నాగబాబు

Advertiesment
nagababu

వరుణ్

, గురువారం, 29 ఫిబ్రవరి 2024 (16:04 IST)
పోలీస్ పాత్రకు 6 అడుగుల 3 అంగుళాలు ఎత్తును కలిగివుండే వ్యక్తులు చేస్తే బాగుంటుందన, 5 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉండే వ్యక్తులు పోలీసులుగా చేస్తే అస్సలు ఏమాత్రం బాగుండదని నటుడు, మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాణలు చెప్పారు. ఇదే విషయంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. హీరో వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు నటుడు నాగబాబు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా క్షమాపణలు చెబుతూ నోట్‌ విడుదల చేశారు.
 
'పోలీస్‌ పాత్ర 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది. 5 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుండదు అని ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాను. ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా. ఎవరైనా వాటికి నొచ్చుకొని ఉంటే క్షమించండి. అవి యాదృచ్ఛికంగా వచ్చినవే కానీ.. కావాలని అన్న మాటలు కాదు. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా' అంటూ రాసుకొచ్చారు. 
 
మరోవైపు నాగబాబు వ్యాఖ్యలపై వరుణ్‌తేజ్‌ కూడా స్పందించారు. ఎత్తుకు సంబంధించి తన తండ్రి చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి కాదన్నారు. తన హైట్‌ను దృష్టిలో పెట్టుకొని చిన్న పోలిక చేశారని.. ఏ హీరోను కించపరిచే ఉద్దేశం లేదన్నారు. కాగా, శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన చిత్రమే ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’.
 
గత 2019లో జరిగిన పుల్వామా దాడి ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందింది. భారత వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను ఇందులో చూపించనున్నారు. మానుషి చిల్లర్‌ హీరోయిన్‌. మార్చి 1న  తెలుగు, హిందీలో విడుదల కానుంది. రుహానీ శర్మ, నవదీప్‌ కీలక పాత్రలు పోషించారు. తాజాగా సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్‌ మంజూరు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌తో పవన్ నాలుగో పెళ్లి.. ఫోటోలు వైరల్