Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

పవన్‌తో సినిమా ఖాయం.. అడ్వాన్స్ తిరిగి తీసుకోలేదు: మైత్రీ మూవీ మేకర్స్

Advertiesment
Mythri Movie Makers
, బుధవారం, 31 అక్టోబరు 2018 (15:15 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా ఖచ్చితంగా ఉంటుందని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్‌, మోహన్‌, రవి శంకర్‌‌లు స్పష్టం చేశారు. 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం' వంటి మూడు బాక్సాఫీట్ హిట్ చిత్రాలను నిర్మించిన వరుస విజయాలను తమ ఖాతాలో వేసుకున్న నిర్మాతలు. వీరు తమ సంస్థ తదుపరి ప్రాజెక్టులను మీడియాకు వివహించారు. 
 
మున్ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఖచ్చితంగా సినిమా ఉంటుంది. నిజానికి ఆయనతో సినిమా చేద్దామనుకున్నాం. ఆయన రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల కుదర్లేదు. ఆయన దగ్గరి నుంచి అడ్వాన్సు వెనక్కి తీసుకున్నామన్న మాటలో నిజంలేదు. త్వరలోనే పవన్‌తో ఓ సినిమా చేస్తామని చెప్పారు. 
 
ఇకపోతే, ఇప్పటివరకు తాము నిర్మించిన 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం' చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయని, ఈ విజయాలను కాపాడుకునేలా తాము కథలను ఎంచుకున్నట్టు చెప్పారు. ఆ కోవలోనే సవ్యసాచి ఉంటుందని చెప్పారు. 
 
గత యేడాది సెప్టెంబరు నెలలో చందూ మొండేటి సవ్యసాచి కథ చెప్పారు. కాన్సెప్ట్‌ కొత్తగా అనిపించింది. యాక్షన్‌కీ, వినోదానికి, ఎమోషన్‌కీ ప్రాధాన్యత ఉన్న కథ ఇది. ట్రైలర్‌ చూసి యాక్షన్‌ సినిమా అనుకోవద్దు. రెండే రెండు పోరాట దృశ్యాలున్నాయి. అవి కూడా సాధారణ చిత్రాల్లో కనిపించే ఫైట్స్‌లా ఉండవు. మాధవన్‌ పాత్ర చాలా కీలకం. కథ చెప్పగానే ఆయనకు బాగా నచ్చేసింది. సెట్లో తన పాత్రకు మరిన్ని మెరుగులు దిద్దారు. ద్వితీయార్థం మొత్తం చైతు - మాధవన్‌లపైనే సాగుతుందని వివరించారు. ఈ చిత్రం నవంబరు 2వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'స‌వ్య‌సాచి'కి మాధ‌వ‌న్ కండీష‌న్ పెట్టారా..?