Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

Advertiesment
Upasana Kamineni Konidela

దేవీ

, మంగళవారం, 8 జులై 2025 (18:00 IST)
Upasana Kamineni Konidela
ఉపాసనా కామినేని కొణిదెల ఆధ్యాత్మికతపై గొప్ప నమ్మకంతో ఉంటారు. తాజాగా ఆమె ఒక వీడియోలో తన సాయి బాబా మీద ఉన్న భక్తిని గురించి చెప్పారు. ముఖ్యంగా సాయి బాబా వ్రతం, దానివల్ల తన జీవితంలో ఎలా మార్పులు వచ్చాయో ఆమె తన అనుభవాలతో చెప్పారు. అత్తమ్మ కిచెన్ పుస్తకంలో ఉన్న శ్లోకాలు చదువుతూ తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.
 
'ప్రతి ఒక్కరికీ ఇష్టదైవం వుంటుంది. నా భర్తకి అయ్యప్ప స్వామి అంటే భక్తి. నాకు సాయి బాబా పట్ల విశ్వాసం. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో తాతయ్య, అమ్మమ్మలు, అమ్మా నాన్నలంతా దేవుడి మీద ఎంతో భక్తితో ఉండేవాళ్లు. వాళ్లని చూసి నాకూ ఆ విశ్వాసం బలంగా పెరిగింది. ఒకసారి జీవితంలో కష్టంగా ఉన్న సమయంలో, ఏటూ తేల్చుకోలేని పరిస్థితి వున్నప్పుడు ఒక్కసారి సాయి బాబా వ్రతం ఆచరించమని వారు చెప్పారు. ఆ కథ చదవటం మొదలుపెట్టిన తర్వాతే మార్పులు మొదలయ్యాయి” అని చెప్పారు ఉపాసన.
 
“నేను మెల్లిగా పాజిటివ్‌గా మారాను. నా చుట్టూ ఉన్న వాళ్లు కూడా హాయిగా మారిపోయారు. ఇవి చిన్నచిన్న మార్పుల్లా కనిపించినా, వ్యక్తిత్వంగా చాలా గొప్ప మార్పులు వచ్చాయి. అందుకే ఈ వ్రతంపై చాలా విశ్వాసం వుంది.  జీవితంలో ఏదైనా అడ్డు ఎదురైతే, ఏదీ సరిగా జరగకపోతే, వ్రతం లాంటి ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రయత్నించొచ్చు. ఎందుకంటే ఈ లోకంలో ఏ మందు చేయని పని, విశ్వాసం చేస్తుంది' అన్నారు.
 
స్పిరిచ్యువాలిటీని అలావాటు చేసుకోవడం వల్ల మనిషిలో గొప్ప మార్పులు వస్తాయి. ఉపవాసాలు, వ్రతాలు మన మనసును శుభ్రం చేస్తాయి. నిజమైన నమ్మకంతో చేస్తే జీవితంలో మార్పులు వస్తాయని ఉపాసన షేర్ చేసిన వీడియో ఆధ్యాత్మికత పట్ల గొప్ప స్ఫూర్తిని ఇస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Pawan: హరి హర వీరమల్లు అసలు కథ ఇదేనంటే క్లారిటీ ఇచ్చిన నిర్మాత