Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pawan: హరి హర వీరమల్లు అసలు కథ ఇదేనంటే క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Advertiesment
Hari Hara Veeramallu

దేవీ

, మంగళవారం, 8 జులై 2025 (17:46 IST)
Hari Hara Veeramallu
పవన్ కళ్యాణ్ నూతన చిత్రం 'హరి హర వీరమల్లు' తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా రూపొందించబడిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదు. ఈ చిత్రం నిజ జీవితంలోని ఏ ఒక్క నాయకుడి కథ ఆధారంగానూ తెరకెక్కలేదు. సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా ఇది తెరకెక్కింది.
 
జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత 'హరి హర వీరమల్లు' కథ పూర్తిగా మారిపోయింది. దర్శకుడు కథలోని స్ఫూర్తిని, సారాన్ని అలాగే ఉంచుతూ.. సరికొత్త కథగా దీనిని మలిచారు.
 
పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామిని శివుడు-మోహినిల కుమారుడిగా, శైవం మరియు వైష్ణవం మధ్య వారధిగా ఎలా వర్ణిస్తారో..  అలాగే 'హరి హర వీరమల్లు'ను శివుడు మరియు విష్ణువుల అవతారంగా చూడబోతున్నాం.
 
సరిగ్గా గమనిస్తే, హరి(విష్ణు) హర(శివుడు) అనే టైటిల్ ఈ చిత్ర సారాంశాన్ని తెలియజేస్తుంది. శివుడు, విష్ణువుల అవతారం 'వీరమల్లు' అని తెలిపేలా ఈ చిత్రంలో పలు అంశాలను గమనించవచ్చు. విష్ణువు వాహనం గరుడ పక్షిని సూచించే డేగను ఈ చిత్రంలో ఉపయోగించారు. అలాగే, కథానాయకుడు తన చేతుల్లో శివుడిని సూచించే డమరుకం పట్టుకున్నాడు. ఈ చిత్రంలో కథానాయకుడు ధర్మాన్ని రక్షించడానికి మరియు ధర్మం కోసం పోరాడటానికి శివుడు, విష్ణువుల యొక్క రూపంగా కనిపిస్తాడు.
 
'హరి హర వీరమల్లు' సినిమాను ఎ.ఎం. రత్నం అత్యధిక బడ్జెట్ తో భారీస్థాయిలో నిర్మించారు. భారీ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన ఎ.ఎం. రత్నం.. గతంలో కూడా ఇలా అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలతో ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. 'హరి హర వీరమల్లు'పై కూడా ఆయన ఎంతో నమ్మకంతో ఉన్నారు. అందుకే ఓవర్సీస్, హిందీ తప్ప సినిమాకి సంబంధించిన మిగతా హక్కులను అమ్మడానికి ఎ.ఎం. రత్నం సిద్ధమవ్వలేదు. 
 
అసలే పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా, దానికితోడు సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో 'హరి హర వీరమల్లు'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరినీ విశేషంగా ఆకట్టుకొని.. అంచనాలను రెట్టింపు చేసింది. దాంతో ఈ చిత్ర హక్కులను దక్కించుకోవడానికి తీవ్ర పోటీ నెలకొంది. ఎందరో పంపిణీదారులు ఇప్పటికే నిర్మాతను సంప్రదించారు. భారీ మొత్తాన్ని చెల్లించి, హక్కులను పొందేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. సినిమాని భారీస్థాయిలో రూపొందిస్తే.. హక్కుల రూపంలో ఉత్తమ ధరలను పొందగలమని నిర్మాతలు నమ్మారు. అందుకే ఎక్కడా రాజీ పడకుండా 'హరి హర వీరమల్లు'ను అత్యంత భారీస్థాయిలో నిర్మించారు. నిర్మాతల నమ్మకం నిజమై.. చిత్ర పంపిణీ హక్కులు భారీ ధర పలుకుతున్నాయి. ప్రేక్షకులు కూడా వెండితెరపై ఈ చిత్రాన్ని చూసి అనుభూతి పొందటం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 
 
'హరి హర వీరమల్లు' చిత్రం జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
 
తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి.
దర్శకత్వం: జ్యోతి కృష్ణ , క్రిష్ జాగర్లమూడి, 
నిర్మాత: ఎ. దయాకర్ రావు 
సమర్పణ: ఎ. ఎం. రత్నం
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్ 
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతాన్, సోజో స్టూడియోస్, యూనిఫై మీడియా, మెటావిక్స్ 
కళా దర్శకుడు: తోట తరణి 
నృత్య దర్శకత్వం: బృందా, గణేష్
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ - లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు