రాశీఖన్నాకు ఆ హీరో ఫేవరేట్ హీరోనట... బుట్టలో వేస్తుందా...?
'ఊహలు గుసగుసలాడే'తో 2014లో కెరీర్‌ను ప్రారంభించి.. మూడేళ్ళలో పలు చిత్రాల్లో దూసుకుపోతోంది రాశీఖన్నా. రవితేజతో బెంగాల్ టైగర్, ఆ తర్వాత జోరు, జిల్, సుప్రీమ్ తదితర చిత్రాల్లో నటించిన రాశీఖన్నా.. గోపీచంద్‌తో ఆక్సిజన్, రామ్‌తో హైపర్ చిత్రాల్లో నటిస్త
'ఊహలు గుసగుసలాడే'తో 2014లో కెరీర్‌ను ప్రారంభించి.. మూడేళ్ళలో పలు చిత్రాల్లో దూసుకుపోతోంది రాశీఖన్నా. రవితేజతో బెంగాల్ టైగర్, ఆ తర్వాత జోరు, జిల్, సుప్రీమ్ తదితర చిత్రాల్లో నటించిన రాశీఖన్నా.. గోపీచంద్‌తో ఆక్సిజన్, రామ్‌తో హైపర్ చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు రాబిన్‌హుడ్ చిత్రంలోనూ చేయనున్న ఈమె తనకు ప్రేమ విషయంలో దాపరికం లేదనీ చెబుతూ.. సినిమా లవ్‌స్టోరీలు కంటే రియల్ లవ్‌స్టోరీ అంటే తన తల్లిదండ్రులదేనని చెబుతోంది.
వ్యక్తిగత ఇష్టాయిష్టాలను ప్రకటించింది. తెలుగులో చక్కటి కుటుంబకథా చిత్రంగా 'బొమ్మరిల్లు' బాలీవుడ్‌లో 'ఖూబ్‌సూరత్'గా పేర్కొంది. పాటల్లో తాను నటించిన 'ఊహలు..'లో ఏం సందేశం లేదు.. అనే పాట ఇప్పటికీ వినాలిపిస్తుందని చెబుతోంది. ఫేవరేట్ హీరో మహేష్ బాబు అనీ, హిందీలో రణభీర్ కపూర్ అని పేర్కొంది. తన కో-ఆర్టిస్టు అని చెప్పను కానీ.. రామ్ తన ఫేవరేట్ కో-స్టార్ అనీ.. హైపర్‌లో అతని నటన అద్భుతమని కితాబిస్తోంది. ఫేవరేట్ విహార యాత్ర ప్రదేశంగా సౌత్ స్పెయిన్‌ను పేర్కొంది. తనకు ఇష్టమైన డ్రెస్ తెల్లటి దుస్తులు ధరించడమని చెబుతోంది.