సునీల్ జక్కన్న సక్సెస్‌కు చిరంజీవి ఓ కారణం...
'జక్కన్న' సినిమాను 12 కోట్లతో సినిమాను రూపొందించాం. ఇప్పటికి సినిమా ఎనబై శాతం కలెక్ట్ చేసింది. బయ్యర్స్ సేఫ్ అయ్యారు. ఎంటర్‌టైనింగ్ సినిమా కావడంతో మేం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సక్సెస్‌కు కారణమైన వ్యక
'జక్కన్న' సినిమాను 12 కోట్లతో సినిమాను రూపొందించాం. ఇప్పటికి సినిమా ఎనబై శాతం కలెక్ట్ చేసింది. బయ్యర్స్ సేఫ్ అయ్యారు. ఎంటర్‌టైనింగ్ సినిమా కావడంతో మేం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సక్సెస్‌కు కారణమైన వ్యక్తుల్లో చిరంజీవిగారు మొదటి వ్యక్తి, ఆడియో వేడుకకు వచ్చి ఆయన అందించిన ఆశీర్వాదమే సినిమా ఇంత పెద్ద హిట్ సాధించింది. అలాగే సునీల్‌గారు ఇంతకుముందు చిన్న చిన్నప్లాప్స్‌లో ఉన్నప్పటికీ వంశీ ఈ సినిమాను మనం కొడుతున్నాం అని నాకు ధైర్యం చెప్పి నన్ను ముందుకు తీసుకెళ్ళారని.. దర్శకుడు వంశీకృష్ణ తెలియజేశారు.
కలెక్షన్ల వివరాలు తెలుపుతూ...
సోమవారం రోజున అన్నీ సెంటర్స్‌లో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. హైదరాబాద్‌లోని మల్లిఖార్జున, మూసాపేటలోని శశికళ, లక్ష్మీకళ థియేటర్స్‌కు వెళ్ళాను. సినిమా చూసి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. మొదటి నాలుగు రోజుల్లో సునీల్ సినిమాల్లో పెద్ద సక్సెస్‌ను సాధించి 9 కోట్ల రూపాయల షేర్‌ను సాధించింది. సునీల్ సినిమాల్లోనే హై ఓపెనింగ్స్‌తో పెద్ద రికార్డును సాధించింది. మర్యాద రామన్న, పూలరంగడు... తర్వాత సునీల్‌కు భారీ రేంజ్ హిట్ అని అంటున్నారు.
ఏలూరులో సింగిల్ థియేటర్‌లో సినిమా రన్ అవుతుంది. వర్షాలు పడుతున్నా నాలుగు ఆటలు హౌస్‌ఫుల్ అయ్యాయి. తొర్రూర్, కర్నూల్, విజయవాడ ప్రాంతాల్లో అన్ని షోస్ ఫుల్ అయ్యాయి. వైజాగ్ ఏరియాకు కోటి ఇరవై లక్షలకు బిజినెస్ చేస్తే నాలుగు రోజుల్లో 90లక్షలను కలెక్ట్ చేసింది. తూర్పుగోదావరిలో 90లక్షల బిజినెస్ చేస్తే నాలుగు రోజుల్లో 67 లక్షల బిజినెస్ చేసింది. నెల్లూరు 50 లక్షల బిజినెస్ చేస్తే 30లక్షలు కలెక్ట్ చేసి సినిమా పెద్ద రేంజ్‌లో దిశగా దూసుకెళ్తోంది. ప్రొద్దుటూరులో 6.2లక్షలు, కావలిలో 6.7లక్షలు కలెక్ట్ చేసింది. జక్కన్న అనే సినిమాను ఎ సెంటర్ ప్రేక్షకులు బావుందంటే బి, సి సెంటర్స్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు అంటూ మంగళవారంనాడు వెల్లడించారు.