ఈ సంవత్సరం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం జయంతి (జూన్ 4) నుండి ప్రపంచ సంగీత దినోత్సవం (జూన్ 21) వరకు మ్యాజిక్ FM ప్రత్యేకమైన పద్ధతిలో జరుపుకుంది. లెజెండ్ ఎస్పిబి గారి జ్ఞాపకార్థం పిల్లలకు పాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పిల్లలు కేవలం ఎస్పీబీ పాటలు మాత్రమే పాడారు. ఈ తరం పిల్లలకు SPB యొక్క సంగీతాన్ని మరియు ఆయన గొప్పతనాన్ని తెలియజేయడమే BGG కార్యక్రమం వెనుక ముఖ్య ఉద్దేశ్యం. మ్యాజిక్ 106.4 ఎఫ్‌ఎమ్ ఆదర్వ్యంలో ఈ సంగీత నివాళి నిర్వహించబడింది. ఈ పోటీ యొక్క మొత్తం ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వారి వీడియోలను వాట్సాప్ ద్వారా మరియు మ్యాజిక్ ఎఫ్.ఎం డిజిటల్ పేజీలకు పంపించారు.
ఎస్‌పిబి కుమారుడు ఎస్పీ చరణ్, కోటి, ఆర్‌పి పట్నాయక్, ఎంఎం శ్రీలేఖ, కెఎమ్ రాధాకృష్ణన్ వంటి ప్రముఖులు బిజిజి కార్యక్రమాన్ని అభినందించి ప్రోత్సహించారు. అంతే కాదు ఈ బిజిజి కాంటెస్ట్ కు సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయక్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించి టాప్ 5 సింగర్స్ ను ఎంపిక చేశారు. టాప్ 5 ఫైనలిస్టుల్లో ప్రియాంక ప్రభాకరన్, సంజన, వెంకట శ్రీకీర్తి, ధ్రువ ప్రజ్వల్, తన్విలు నిలవగా.. విజేతలుగా ప్రియాంక ప్రభాకరన్ మరియు సంజనలు బహుమతులు కైవసం చేసుకున్నారు.
జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవం రోజున బిజిజి విజేతలు మ్యాజిక్ 106.4 ఎఫ్ఎమ్ స్టూడియోలో.. ఆర్జే రవలి, ఆర్జే కల్యాణ్, ఆర్జె నాటీ నాని, ఆర్జె ప్రతీకల చేతులు మీదగా ట్రోపిలను అందుకున్నారు అలాగే విజేతలకు 5000/- విలువైన గిఫ్ట్ వోచర్లు కూడా అందజేశారు.