Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయ నేతల్లో బాహుబలి-2 సునామీ.. ఇక్కడా రాజకీయాలే మరి

దేశం దేశం బాహుబలి సినిమా జ్వరంతో వేగిపోతోంది. బాహుబలి చూడని వాడు పాపాత్ముడు లెక్కన నేటికీ థియేటర్లు ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నాయి. రాజకీయ నాయకులను కూడా బాహుబలి-2 ఫీవర్ పట్టుకున్నట్లుంది. సమాజ్‌వాదీ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ ఏంటి.. బాహుబలి సిన

రాజకీయ నేతల్లో బాహుబలి-2 సునామీ.. ఇక్కడా రాజకీయాలే మరి
హైదరాబాద్ , బుధవారం, 17 మే 2017 (01:39 IST)
దేశం దేశం బాహుబలి సినిమా జ్వరంతో వేగిపోతోంది. బాహుబలి చూడని వాడు పాపాత్ముడు లెక్కన నేటికీ థియేటర్లు ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నాయి. రాజకీయ నాయకులను కూడా బాహుబలి-2 ఫీవర్ పట్టుకున్నట్లుంది. సమాజ్‌వాదీ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ ఏంటి.. బాహుబలి సినిమాను చూడటమేంటి అని ఆశ్చర్యం కలగవచ్చు కానీ చూసేశారు. తన పార్టీకి చెందిన నేతలతో కలిసివెళ్లి లక్నో లోని ఒక థియేటర్‌లో ప్రత్యేక  ప్రదర్శన వేయించుకుని మరీ సినిమా చూశారు. కాని తనతో పాటు తీసుకెళ్లిన సన్నిహిత సహచరులలో తన కుమారుడు అఖిలేష్ యాదవ్‌ మాత్రం లేకుండా జాగ్రత్తపడ్డారు. ఇక్కడా రాజకీయాలే మరి. 
 
నిత్యం రాజకీయాల్లో మునిగి తేలుతూండే సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్.. మంగళవారం నాడు థియేటర్‌కు వెళ్లి బాహుబలి-2 సినిమా చూశారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను కొంతమందిని తీసుకెళ్లి, లక్నోలోని ఓ థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శన వేయించుకుని మరీ ఆ సినిమాను చూశారు. తన సన్నిహిత సహచరులను మాత్రమే ఆయన ఆ సినిమాకు తీసుకెళ్లారు. వారిలో శివపాల్ యాదవ్‌కు సన్నిహిత అనుచరుడైన అషు మాలిక్, మహ్మద్ షాహిద్ తదితరులున్నారు.
 
ఈ సందర్భంగా మొత్తం థియేటర్ అంతటినీ కేవలం తమ కోసమే ములాయం బుక్ చేయించుకున్నారు. అయితే, ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ములాయం వెంట సినిమా చూసేందుకు యూపీ మాజీ ముఖ్యమంత్రి, ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ మాత్రం వెళ్లలేదు. అలాగే, అఖిలేష్ వర్గానికి చెందినవాళ్లుగా ముద్రపడిన వాళ్లు కూడా ఈ సినిమా చూసిన బృందంలో లేరు. ములాయం వెంట మాత్రం ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా థియేటర్‌లో ఉన్నారు.
 
బాహుబలి రాజకీయ నేతలను కూడా పిచ్చి పిచ్చిగా ఆకర్షిస్తోందంటే సందేహమెందుకు. దేశంలోని సకల సామాజికవర్గాలలో ఈ ఆసక్తి ఉన్నందువల్లే బాహుబలి-2 మరో 3 వారాలపాటు తన ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. దీంతో చైనా, జపాన్ లలో విడుదల కావడానికి ముందే బాహుబలి-2 అసాధారణ స్థాయిలో 2 వేల కోట్ల రూపాయలను వసూలు చేసే అవకాశం ఉందని అనలిస్టుల అంచనా.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అడ్డెడ్డే... అల్లు అరవింద్ 'బాహుబలి'ని ఆకాశానికెత్తేశారు... ఆ విషయంలో పవన్‌కు సపోర్ట్...